సముద్రంలో అల్పపీడనం లేదు.. అటునుంచి అటునుంచి దూసుకువచ్చే తుఫానూ లేదు.. అతలాకుతలం చేసే బలమైన గాలులూ లేవు..అయినా సరే..సాగరం ఒడ్డున గ్రామాల్లో కన్నీటి కడలి ఉప్పొంగుతోంది.దానికి కారణం గత ఆరునెలలుగా దాయాదుల చెరలో సిక్కోలు మత్స్యకారులు బందీలుగా మారారు.దీంతో బాధిత కుటుంబసభ్యులు వారికోసం ఎదురు చూపులు.మగ దిక్కు లేకపోవడంతో వేట సాగక...పూట గడవక.మత్స్యకార మహిళలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోపక్క పరిహారం పేరుతో బాధిత కుటుంబాలతో మత్స్య శాఖాధికారుల పరిహాసం చేస్తున్నారు.రాష్ట్రంలో ఎక్కువ తీర ప్రాంతం కలిగిన జిల్లా శ్రీకాకుళం..!వందకు పైగా గ్రామాల్లోమత్స్యకారులకు సాగరంలో వేటే వీరి జీవనోపాధి..!కడలి ఒడ్డున ఉండి చూస్తే కనుచూపుమేరా గంగమ్మే.!ఇలాంటి నీరే..గుజరాత్ లొనే ఉంది.ఇక్కడ లేనిదేమిటీ...అక్కడున్నదేమిటీ?ఈ ప్రశ్నలకు వలస జీవులు చెప్పే సమాధానం ఒక్కటే!నాలుగు డబ్బులు కళ్ళ చూడాలంటే సిక్కోలు జిల్లాను వదిలి గుజరాత్ లోని వీరావల్ కు వెళ్లారు. ఈ నేపధ్యంలోనే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని బడివానిపేట,డి.మత్స్యలేశం గ్రామాలకు చెందిన 11 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళి చివరకు పాకిస్థాన్ దేశం కోష్టు గార్డులు చిక్కి దాయాదుల చెరలో బందీలుగా మారారు.పాకిస్థాన్ దేశం చెరలో ఉన్న ఈ రెండు గ్రామాలకు చెందిన మత్స్యకార కుటుంబాలలో అంతులేని ఆవేదన గూడుకట్టుకుంది.జిల్లాకు చెందిన 11మంది మత్స్యకారులు పాకిస్థాన్ తీర ప్రాంత భద్రతా దళాల చేతిలో బందీ కావడం జిల్లాలోనే దేశవ్యాప్తంగా కలకలం రేపింది.వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ముమ్మరగంగా కసరత్తు సాగిస్తూనే ఉంది.ఇందులో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి,ఇద్దరు కుమారులు..మరో కుటుంబంలో తండ్రీ,కుమారుడు కూడా పాకిస్థాన్ చెరలో బందీలుగా మారడంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరో వైపు ఒక్కో బాధిత కుటుంబానికి ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ప్రభుత్వం అందించింది.ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకుంది,అనుకున్న అంతలోనే మత్స్యశాఖ బాధితులకు ఇచ్చిన సొమ్మును మళ్ళీ తమకు సబ్సీడీ పై బోట్లూ, లగేజీ ఆటోలు ఇప్పిస్తామంటూ 11 మంది బాధితుల కుటుంబాల వద్ద నుంచి బోటుకు, ఒక లక్షా ఇరవై అలాగే లగేజీ ఆటోకు ఒకలక్షా పన్నెండు వేల రూపాయలను బాధితుల అకౌంట్ నుంచి లక్షల రూపాయలను మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఖాతాకు కు బాధితుల సొమ్మును మళ్ళించుకొని నాలుగు నెలలుగా ఇంతవరకు బోట్లూ, ఆటోలను ఇవ్వకుండా మత్స్యశాఖ అధికారులు పొంతనలేని సమాధానం చూపుతున్నారూ.అంతే కాకుండా బాధిత కుటుంబానికి ప్రకటించిన 4500 రూపాయల ఫించను కూడా ఇవ్వడంలేదని మత్స్యశాఖ డిడి తీరు పై మత్స్యకార బాధిత మహిళలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.పాకిస్థాన్ చెరలో ఉన్న 11 మంది మత్స్య కారుల ఒక్కో కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల ను ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ సబ్సీడికు బోట్లను, ఆటోలను ఇస్తామంటు తమశాఖ ఖాతాలోకి బాధితుల సొమ్మును నొక్కేసి ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్నా ఎటువంటి బోట్లు గానీ లగేజీ ఆటోలను గానీ ఇవ్వకుండా పొంతనలేని సమాధానం చెప్పడం వెనుక మత్స్యశాఖ డిడి బాధిత కుటుంబాలను మోసం చేసే విధంగా తమకు కనిపిస్తుందని,మత్స్యకారుల అభివృద్ధికి పాటుపడవలసిన డిడి మత్స్యకారుల కుటుంబాలను ఇలా చవ్యడం తగదని మత్స్యకార సంఘం నాయకుడు రామారావు ఆరోపిస్తున్నారు.పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న వారికోసం అన్న హారాలు మాని తమ భర్త కోసం ఎదురు చూస్తూ పిల్లా పాపాలతో నిరీక్షిస్తున్నామని,తన భర్త బందీ కావడంతో తనకు పాకిస్థాన్ నుంచి తనకు ఉత్తరం వ్రాసి తన చంటి పిల్లలను గురించి అడుగుతున్నారని,తన భర్త దూరంగా ఉండటంతో కుటుంబం రోడ్డున పడ్డామని మత్స్యకార మహిళ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.11 మంది మత్స్యకారులు పాకిస్థాన్ భద్రతా బలగాల చేతిలో చిక్కి బందీలుగా ఉన్న మత్స్యకారుల బాధిత కుటుంబాలకు ఇచ్చిన సొమ్మును జిల్లా మత్స్యశాఖ డిడి ఖాతాకు మళ్లించి ఇంత వరకు మత్స్యకారుల బాధిత కుటుంబాలకు అందవలసిన బోట్లు,లగేజీ ఆటోలు అందివ్వకుండా మత్స్య శాఖాధికారులు బాధితుల నుంచి లక్షలాది రూపాయల సొమ్మును తమ వద్దనే ఉంచుకొని ఇంతవరకు ఇవ్వకపోవడం వెనుక మత్స్యశాఖ అధికారుల తీరుపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.దాయాదుల చెరలో బందీలుగా ఉన్న 11 మంది మత్స్యకారులను విడిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అందించిన 2 లక్షలరూపాయలను అందేలా చర్యలు తీసుకొని,బాధిత మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా బోట్లు,ఆటోలు ఇప్పించవలసిందిగా బాధిత మత్స్యకార కుటుంబాలకు చెందిన సొమ్మును వెంటనే మత్స్యశాఖ డిడి ఖాతా నుంచి బాధిత మత్స్య కారుల ఖాతాలోకి ఆ సొమ్మును జమ అయ్యేలా చూడాలని మత్స్యకార సంఘం
కోరుతోంది.