YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వెటర్నరీ వర్శిటీలో నిధుల దారి మళ్లింపు....

 వెటర్నరీ వర్శిటీలో నిధుల దారి మళ్లింపు....

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో నిధుల దారి మళ్లింపు వ్యవహారం ఇపుడు పెద్ద చర్చకు దారి తీసింది. యూనివర్సిటీలో పనిచేసే అసిస్టెంట్‌ కంట్రోలర్‌ వి.రామ్మోహన్ వర్సిటీ ఖాతా నుంచి మొత్తం 13 లక్షల నిధులు తన కుమార్తె అకౌంట్‌కు బదిలీ చేశారు.ప్రశాంతి అనే మహిళ ఉద్యోగి ఈ విషయాన్ని గుర్తించింది. ఈ ఘరానా మోసాన్ని వర్సిటీ చాన్సలర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ వేగవంతం చేసిన అధికారులు అతన్ని ప్రస్తుతానికి సస్పెన్షన్‌ చేశారు.ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి దేశంలోనూ... రాష్ట్రంలోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఇందులో‌ పనిచేసే అధికారులు ఉద్యోగులు కలిసి యూనివర్సిటీ ఖాతా నుండి డబ్బును డ్రా చేసి మోసం చేయాలని చూసి ఇపుడు అడ్డంగా దొరికి పోయారు. వి. రామ్మోహన్ తో పాటుఅతనికి సహకరించిన వారు కొందరు అధికారులు ఉన్నట్టు ప్రాధమికంగా గుర్తించారు. ఫిర్యాదులో రామ్మోహన్ తో పాటు వీసీ డాక్టర్‌ వై.హరిబాబు, కంట్రోలర్‌ డాక్టర్‌ వి.పద్మనాభరెడ్డిలను కూడా బాధ్యులుగా చేర్చి ఉండడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై ఫిర్యాదుదారు వర్సిటీ చాన్సలర్‌తోపాటు పశుసంవర్ధకశాఖ ప్రధాన కార్యదర్శికి, వర్సిటీ ఈసీ సభ్యులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎస్వీ యూనివర్సిటీ ఖాతా నుంచి అసిస్టెంట్‌ కంట్రోలర్‌ రామ్మోహన్ కుమార్తె ఖాతాకు నిధులు బదిలీ చేసినట్టు గుర్తించారు. మొత్తం 13 లక్షలు ట్రాన్స్ పర్ అయినట్టు నిర్ధారించారు... ఈ విషయంపై విచారణ జరపాలని ప్రభుత్వానికి యూనివర్సిటీ లో జరిగిన పాలకమండలి లో సైతం నిర్ణయం తీసుకున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల్లో మూడు విడతలుగా నిధులు బదిలీ చేశారన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. ఇందుకు సంబంధించిన బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌, అకౌంట్‌ నెంబర్లను ఫిర్యాదులో పొందుపరిచారు. సీఎస్‌ఎంఎస్‌ ద్వారా 80 వేలు బదిలీ చేసిన డాక్యుమెంట్‌ను లేఖతో జతపరిచారు. గతంలోనూ ఇదే రామ్మోహన్ మార్ఫింగ్‌ కేసులో చిక్కుకుని సస్పెన్షన్‌కు గురైనట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత తిరిగి గతేడాది ఉద్యోగంలో చేరి పదోన్నతి పొంది ఇప్పుడు అసిస్టెంట్‌ కంట్రోలర్‌గా పనిచేస్తున్నారు.ఇటీవలే వీసీ చాంబర్‌లో వీసీ పీఏగా అదనపు బాధ్యతలు చేపట్టారు..కాగా, ఈ నిధుల మళ్లింపు వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది.

Related Posts