YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అడ్డగోలుగా దోచేస్తున్న వ్యాపారులు

అడ్డగోలుగా దోచేస్తున్న వ్యాపారులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

మీరు బంగారం కొన‌డానికి షాపుకెళ్తున్నారా...?పెట్రోల్ కోసం బంక్ కు వెళ్తున్నారా..?ప్రభుత్వం ఇచ్చే స‌రుకుల కోసం రేష‌న్ షాపుకెళ్తున్నారా...?అయితే ఖ‌చ్చితంగా మీరు మోస‌పోతున్నట్లే...అవును...ఇది నిజం..ఏ దుకాణానికెల్లినా అడుగ‌డుగునా తూకాల్లో మోస‌మే...ఇది ఎవ‌రో చెప్పింది..కాదు ఏపీలో తూనిలు కొల‌త‌ల శాఖ అధికారులు నిగ్గు తేల్చిన నిజం...అందుకే ఇలాంటి మోసాలు అరికట్టి ప్రజ‌ల‌కు న్యాయం చేసేందుకు సిద్దమ‌వుతుంది ఏపీ స‌ర్కార్...  ఏపీలో తూనిక‌లు,కొల‌త‌ల శాఖ త‌నిఖీల్లో క‌ళ్లుచెదిరే నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి..ఆ షాపు,ఈ షాపు అని లేదు,ప్రాంతాల‌తో సంబంధం లేదు..త‌మ ద‌గ్గర‌కు వ‌స్తున్న వినియోగ‌దారుల క‌ళ్లుగ‌ప్పి...వారిని అడ్డంగా ముంచేస్తున్నాయి దుకాణాలు....ముఖ్యంగా బంగారం షాపులు,పెట్రోల్ బంకులు,ఎరువుల దుకాణాలు,గ్యాస్ సిలిండ‌ర్లు,వే బ్రిడ్జిలు,స్వీట్ షాపులు....ఇలా ఒక‌టేమిటి..అన్నింటా అక్రమాలే...పైకి వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే  ప్రక‌ట‌న‌లు ఇస్తున్నప్పటికీ లోప‌ల మాత్రం అంతా మోస‌మే...పెట్రోల్ బంకుకు వెళ్తే వాహ‌న‌దారుడికి ఖ‌చ్చితంగా న‌ష్టం త‌ప్పడం లేదు..ప‌ది లీట‌ర్ల పెట్రోల్ కొట్టిస్తే కాస్త అటుఇటుగా ఒక లీట‌ర్ మాయం అవుతుంది...అంటే లీట‌ర్ కు ప‌దిశాతం త‌గ్గిపోతుంది...ఇలా గ‌తేడాది జ‌రిపిన త‌నిఖీల్లో 74 బంకుల్లో అక్రమాలు జ‌రిగిన‌ట్లు గుర్తించారు అధికారులు..మ‌రో 200 బంకుల్లో ఇత‌ర ర‌కాల అక్రమాలు జ‌రుగుతున్నట్లు గుర్తించారు..ఆయా బంకుల‌ను మూసివేయ‌డంతో పాటు లైసెన్స్ ర‌ద్దుకు సిపార్సు చేసారు అధికారులు...వీరి వ‌ద్ద నుంచి గ‌త ఆర్ధిక సంవ‌త్సరంలో సుమారు 50 ల‌క్ష‌లు వ‌సూలు చేసారు.ఇక రైతుల‌కు స‌ర‌ఫ‌రా చేసే యూరియా బ‌స్తాల్లో కూడా అక్ర‌మాల‌కు కొద‌వ లేదు..ఒక్కో బ‌స్తాకు రెండు కేజీల వ‌ర‌కూ మోస‌పోవ‌డ‌మే..అది కూడా పేరొందిన కంపెనీల్లోనే...కోర‌మండ‌ల్,క్రిబ్ కో,నాగార్జున‌,ఐపీఎల్ వంటి కంపెనీల్లో ఈ మోసాలు జ‌రుగుతున్న‌ట్లు అధికారులు గుర్తించారు...ఇలా మోసాలు జ‌రుగుతున్న చోట జ‌రిమానా కింద కోటికి పైగా వ‌సూలు చేసారు... అటు బంగారం షాపుల్లో వ్యాట్ 12 శాతానికి మించ‌కూడ‌ద‌న్నప్పటికీ...14 నుంచి 24 శాతందాకా వేసేస్తున్నారు...ఇలా మొత్తం 73 షాపుల్లో అడ్డగోలుగా వినియోగ‌దారుల‌ను న‌ట్టేట ముంచేస్తున్నట్లు గుర్తించారు అధికారులు..షాపులు ఇచ్చే ప్రక‌ట‌న‌లు చూసి మోసపోవ‌ద్దని ప్రభుత్వం చెబుతుంది...ఇలా ఒక‌టి కాదు రెండు కాదు దాదాపు 90 శాతం బంగారం షాపులు ప్రజ‌ల నెత్తిన శ‌ఠ‌గోపం పెడుతున్నాయ‌ని అధికారులు తేల్చారు..అటు సాధార‌ణ ప్రజ‌ల కోసం ప్ర‌భుత్వం స‌ర‌ఫ‌రా చేసే పౌర‌స‌ర‌ఫ‌రాల దుకాణాల్లోనూ భారీగా తూకాల మోసాలు బ‌య‌ట‌ప‌డ్డాయి...మొత్తం 1671 ఫెయిర్ ప్రైస్ షాపుల్లో తూకాల్లో తేడాలు గుర్తించి...వారికి జ‌రిమానా విధించారు..ఇలాంటి షాపుల‌పై క‌ఠిన‌చ‌ర్య‌ల‌కు సిద్దమ‌వుతుంది స‌ర్కార్...అటు ఒక్కో గ్యాస్ సిలిండ‌ర్ కూ రెండు కేజీలు త‌గ్గిపోతున్నట్లు అధికారుల త‌నిఖీల్లో బ‌య‌ట‌ప‌డింది...గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ల వ‌ద్ద ఈ అక్రమాలు జ‌ర‌గుతున్నట్లు గుర్తించారు..ఇక వేబ్రిడ్జిల్లో కూడా మోసాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. తూకాల్లో అక్రమాలే కాదు...ఎమ్మార్పీ ధ‌ర‌ల కంటే ఎక్కువ రేటుకు అమ్మకాలు జ‌రుపుతున్నాయి కొన్ని షాపులు..సెలెక్ట్ ఛాన‌ల్ పేరుతో ఎమ్మార్పీని వైలెట్ చేస్తున్నట్లు గుర్తించారు..ఇలా అక్రమాల‌కు పాల్పడుతున్న షాపుల నుంచి గ‌తేడాది ఎనిమిదిన్న‌ర కోట్ల వ‌ర‌కూ జ‌రిమానాల కింద వ‌సూలు చేసారు అధికారులు..ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు టోల్ ఫ్రీ నెంబ‌ర్ ఏర్పాటుచేస్తామంటున్నారు మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు...శాఖ‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీచేసి పూర్తిస్థాయిలో అక్ర‌మాల‌కు చెక్ పెడ‌తామంటున్నారు.

Related Posts