స్పెషల్ స్టోరీ ఫ్రామ్ యువ్ న్యూస్:
వెండితెర నటుడు.. శొంఠినేని శివాజీ. బహుశ ఇలా అంటే.. గుర్తు పట్టేందుకు చాలా సమయం పడుతుంది. గరుడ పురాణం.. శివాజీ.. అంటే నిముషాల్లోనే గుర్తుకు వచ్చేస్తాడు. ఇప్పుడు ఈ శివాజీ కూడా తన గరుడ పురాణం తనే చెప్పుకోలేని పరిస్థితికి చేరిపోయాడు. 2017లో ఒకలాగా, 2018లో ఒకలాగా 2019కి వచ్చేసరికి మరో విధంగా గరుడ పురాణాన్ని మార్చి మార్చి చెప్పిన శివాజీ.. తన భూతద్దాన్ని మాత్రం తనపై చూపించుకోలేక పోయాడని అంటున్నారు సోషల్ మీడియా జనాలు. ప్రస్తుతం ఆయన టాపిక్ హాట్ హాట్‌గా నడుస్తోంది. ఏపీ రాజకీయాలు, మోడీ గురించి, కేసీఆర్ గురించిన విమర్శలను గరుడ పురాణం రూపంలో యమ గ్రేట్‌గా వివరించిన శివాజీ.. గంటల కొద్దీ మీడియాలో చోటు సంపాయించుకున్నాడు.
బహుశా తను నటించిన మూవీల్లో కంటే.. ఈ గరుణ పురాణాల ద్వారా క్రేజ్‌ని భారీగా సొంతం చేసుకున్నాడు. శివాజీ ఎప్పుడో మాస్టర్ సినిమా నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కలకాలం గుర్తుండిపోయే ఓ పాత్ర చెప్పు బాబు అంటే బహుశా శివాజీయే తాను చేసిన ఓ మంచి పాత్రను చెప్పలేడేమో. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాదు హీరోగానూ శివాజీ ఓ వెలుగు వెలిగింది లేదు. బూచమ్మ బూచోడు లాంటి ఎవ్వరికి తెలియని సినిమా వస్తేనే సూపరెహే అని డప్పుకొట్టేసుకున్నాడు. ఇక ప్రధానంగా చంద్రబాబును ఒకప్పుడు తిట్టినోటితోనే పొగడడం ప్రారంభించాక టీవీలు కమ్మటి కవరేజీ ఇవ్వడం ప్రారంభించాయి. గతంలో ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీకి ఒప్పుకుంటే చంద్రబాబు ఇంటి గుమ్మం ముందే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన శివాజీ. తర్వాత తర్వాత బాబుకు అనుకూల బాకాల్లో మేలురకం బాకాగా అయిపోయి.. బాగా పాపులారిటీ కొట్టేశాడని అంటారు సోషల్ మీడియా జనాలుఇక, తాజా విషయానికి వస్తే.. టీవీ 9 సీఈవో రవి ప్రకాశ్ వ్యవహారం తెరమీదికి వచ్చింది. నిత్యం సత్యం పలుకుతామంటూ.. నీతులు చెప్పిన ఈ సీఈవో.. శ్రీరంగ నీతులు మీకే కానీ మాకు కాదని భావించాడో ఏమో.. ఏకంగా ఫోర్జరీ సంతకాలకు పాల్పడి ఇప్పుడు పోలీసుల ఉచ్చులో చిక్కుకున్నాడు. విషయంలోకి వెళ్తే.. టీవీ 9 యాజమాన్యం మారింది. అలంద మీడియా అనే సంస్థ దీనిని కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు సీఈవోగా ఉన్న రవిప్రకాశ్‌ను కొనసాగించినా.. బోర్డు సమావేశాల విషయంలో అడ్డుతగలడంతో రేగిన వివాదం ఫోర్జరీ సంతకాల వరకు వెళ్లింది. అయితే, రవిప్రకాశ్ తోపాటు టీవీ 9లో వాటాలున్న శివాజీకి కూడా ఈ పాపం ఉందని అలంద మీడియా ఆరోపిస్తోంది. ఈయనపైనా కేసు పెట్టినట్టు సమాచారం.టీవీ9ను కొనుగోలు చేసిన కొత్త యాజమాన్యం శివాజీతో కలసి ఇప్పటి వరకూ సీఈవో గా ఉన్న రవిప్రకాష్ కుట్ర చేశారని ఆరోపిస్తోంది. రవిప్రకాష్ కు చెందిన షేర్లను ఉద్దేశపూర్వకంగానే శివాజీకి బదలాయించినట్లు చూపించి..ఆయనతో ఎన్ సీఎల్ టీలో కేసు వేయించారనేది నూతన యాజమాన్యం ఆరోపణ. మొత్తానికి ప్రపంచం మొత్తం చుట్టిన శివాజీ గరుణ పురాణం.. తన దాకా వచ్చేసరికి మాత్రం ఏమీ చెప్పలేక పోవడం గమనార్హం.