YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వట్టి వసంతకుమార్ కు దారేది

వట్టి వసంతకుమార్ కు దారేది

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సీనియారిటీ ఉండి…. అవకాశమూ ఉండి పోటీ చేయని వ్యక్తులు కూడా కొందరున్నారు. అందులో వట్టి వసంతకుమార్ ఒకరు. మాజీ మంత్రిగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన వట్టి వసంతకుమార్ రాజకీయ భవిష‌్యత్తు ఇక క్లోజ్ అయినట్లేనన్నది ఆయన అనుచరులు సయితం అంటున్న విషయం. ఎటూ తేల్చుకోలేక సతమతమయి ఏ నిర్ణయం తీసుకోకుండా వట్టి వసంతకుమార్ తన రాజకీయ భవిష‌్యత్తును తానే కూలదోసుకున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.వట్టి వసంతకుమార్.. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఉంగుటూరు నియోజవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కుదేలైపోయింది. ఆయన దాదాపు నాలుగున్నరేళ్లు కాంగ్రెస్ లోనే కొనసాగారు. అయితే తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ తెలంగాణలో పొత్తు పెట్టుకోవడాన్ని వట్టి వసంతకుమార్ జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఎన్నికలకు ముందు ఆయన పార్టీకి రాజీనామా చేశారు.కాపు సామాజిక వర్గానికి చెందిన వట్టి వసంతకుమార్ తొలుత జనసేనలో చేరతారని భావించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆయన విశాఖలో కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేనలో చేరతారని భావించినా ఆయన ఆలోచన విరమించుకున్నారు. చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది డిసెంబరు 11వ తేదీన తన అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.ఏం జరిగిందో తెలియదు కాని వట్టి వసంతకుమార్ అనుచరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. వైసీపీలో టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ సుముఖంగా లేరన్న సమాచారంతో ఆయన వైసీపీలో చేరే ఆలోచనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా వట్టి వసంత కుమార్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా మౌనంగానే ఉన్నారు. దీంతో మరో ఐదేళ్లు ఆగుతారా? లేక వైసీపీ అధికారంలోకి వస్తే క్రియాశీలకంగా వట్టి మారతారా… ? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts