YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల ముందు కూటమి కోసం బాబు కసరత్తు

ఎన్నికల ముందు కూటమి కోసం బాబు కసరత్తు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మోదీ ఎట్టిపరిస్థితుల్లో మరోసారి ప్రధాని కాకూడదు. మోదీ మరోసారి ప్రధాని అయితే విపక్షాలు ఏ రాష్ట్రంలో ఉండవు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల పని పడతాడు. అందుకోసమే అందరం ఏకమై మోదీని ప్రధాని కాకుండా అడ్డుకోవాలి. ఇది ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నం. ఫలితాలకు ముందే యూపీఏ కూటమిని ఏర్పాటు చేయాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. ఏమాత్రం అవకాశం వచ్చినా మోదీ ప్రధాని అయ్యే అవకాశం ఉందని గ్రహించిన చంద్రబాబు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ దేశంలో పెద్దగా బలం లేదన్న సంగతి అందరికీ తెలసిందే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వంద స్థానాలు దాటుతాయన్న అంచనా అయితే ఉంది. ఈ సంఖ్యాబలంతో కాంగ్రెస్ పార్టీ మిత్రులకు దగ్గర కాలేదు. మిగిలిన మిత్రులు కలసి రావాల్సి ఉంటుంది. అయితే ప్రాంతీయ పార్టీలే ప్రధాన పాత్రను పోషించనున్నాయన్నది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దక్షిణాదిన, ఉత్తరాదిన ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలన్న నిశ్చయంతో చంద్రబాబు ఉన్నారు.ఇప్పటికే దక్షిణాదిన తెలుగుదేశం పార్టీతో పాటు డీఎంకే, జేడీఎస్ లు కాంగ్రెస్ తో జట్టుకట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ సయితం కాంగ్రెస్ తో చేయి కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. మహారాష్ట్రలో శరద్ పవార్ ఎటూ ఉన్నారు. ఇక ఎటొచ్చీ ఉత్తరప్రదేశ్ లోని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విషయంలోనే కొంత తేడా కొడుతోంది.వీటిని సర్దుబాటు చేసేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాహుల్ తో నిన్న సమావేశంలో కూడా ఇదే అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. ఎన్నికల ఫలితాలకు ముందే కూటమిని ప్రకటిస్తే బాగుంటుందన్న చంద్రబాబు సూచనకు రాహుల్ ఓ‌కే చెప్పారని తెలిసింది. ఈ నెల 21వ తేదీన ఢిల్లీలో విపక్షాలన్నీ సమావేశమై దీనిపై చర్చించాలని నిర్ణయించారు. మరి ఎన్నికలకు ముందే కూటమి ఏర్పాటుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts