యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఈ నెల 14 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. 4 లక్షల 24 వేల 500 మంది విద్యార్థులు హజరు కానున్నారు. ఇందుకోసం 922 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి తెలిపారు. లక్షా 75 వేల మంది ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు రాస్తున్నారు. మొదటి సంవత్సరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకూ పరీక్షలు జరగుతాయని ఆమె అన్నారు. రెండో సంవత్సరం మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకూ పరీక్షలు జరుగుతాయి.
పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసాం. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. జ్ఞానభూమి వెబ్ సైట్ లో హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఆమె అన్నారు.