యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రజావిజ్ఞప్తులను సత్యరమే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ పటాన్ శెట్టి రవి సుభాష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో సమావేశ మందిరం నుంచి డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. వివిధ సమస్యల పై ప్రజలనుంచి 24 ఫోన్ కాల్స్ ద్వారా విజ్ఞప్తులు అందాయి. పరిష్కరించదగిన సమస్యలను అక్కడిక్కడే ఆయన పరిష్కరించారు,. ఆర్ధికేతర సమస్యలను తక్షణ మే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి-2 మణిమాల, జెడ్పి సిఇఓ విశ్వేశ్వరనాయుడు, కర్నూలు ఆర్టీఓ వెంకటేశ్వర్లు, డిఆర్డిఎ, డ్వామా పిడిలు రామక్రిష్ణ, వెంకటసేబ్బయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.