YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

చరణ్ తో బోయపాటి మూవీలో విలనిజం ఒక రేంజ్ లో ఉంటుందట!

Highlights

  • చరణ్ తో బోయపాటి మూవీ 
  • వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర 
  • ఇద్దరూ పవర్ఫుల్ పాత్రలు పోషించనున్నారు
చరణ్ తో బోయపాటి మూవీలో విలనిజం ఒక రేంజ్ లో ఉంటుందట!

బోయపాటి శ్రీను మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే తన సినిమా కథలను రెడీ చేసుకుంటూ ఉంటాడు. ఆయన సినిమాల్లో విలన్ పాత్రను హీరోతో సమానమైన శక్తిసామర్థ్యాలు కలిగినవాడిగా మలుస్తూ ఉంటాడు. బలమైన విలన్ ను ఎదుర్కొన్నప్పుడే అసలైన హీరోయిజం బయటపడుతుందనీ, అప్పుడే అభిమానులు ఎంజాయ్ చేస్తారని ఆయన భావిస్తుంటాడు.

చరణ్ సినిమా విషయంలో కూడా ఈ పద్ధతినే ఆయన పాటిస్తున్నాడని అంటున్నారు. విలన్ గా వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో  నటిస్తున్నాడు. బోయపాటి చాలా క్రూరంగా ఆయన పాత్రను మలిచాడనే టాక్ వినిపిస్తోంది. ఆయన ఎంతటి క్రూరుడు అనే విషయం చెప్పడానికి గాను ఇంట్రడక్షన్ సీన్ లోనే 25 మందిని కారుతో తొక్కించే సీన్ ఉంటుందని చెబుతున్నారు. చరణ్, వివేక్ ఒబెరాయ్ మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాను విడుదల దసరాకి చేసే అవకాశాలు వున్నాయనే మాట వినిపిస్తోంది.

Related Posts