యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
చార్‌ధామ్ యాత్రలో భాగంగా హిందూవులు దర్శించుకునే ఉత్తరాఖండ్‌లోని నాల్గో పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఈ సందర్బంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేదపండితుల ప్రత్యేక పూజల మధ్య ప్రధాన ద్వారాలు తెరుచుకోగా.. బద్రీనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఏటా ప్రతికూల పరిస్థితుల మధ్య శీతాకాలంలో బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేస్తారు. ఆరు నెలల తర్వాత ఆలయ ప్రధాన ద్వారాలను తెరుస్తారు.