యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అద్దెకు ఇచ్చిన బస్సుల అమౌంట్లు క్లీయర్ అయిపోయాయి. ప్రభుత్వకార్యక్రమాలు పెట్టిన బస్సుల బకాయిలు ఇంకా రావాల్సి ఉంది. జిల్లా అధికారుల హామీ మేరకే
పోలవరానికి, అమరావతికి, దివ్యదర్శనానికి బస్సులు తిప్పామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. కొంత వరుకు బకాయిలు ప్రభుత్వం చెల్లించింది. మరికొంత రావాలి. సమ్మె నోటిస్ గురించి కంగారుపడాల్సిన అవసరంలేదు. సమ్మె నోటీసు ఇచ్చినప్పటినుండి సమ్మెకు వెళ్లడానికి 43 రోజుల సమయం ఉంది. గత డిసెంబర్ లో కూడా పే స్కేల్ పై, పెండింగ్ వేతన బకాయిలపై ఇలానే సమ్మె నోటీస్ ఇచ్చారు. ఫిబ్రవరిలో హామీలపై చర్చలు జరిపాం. సమ్మె విరమించారని అయన వివరించారు. ప్రభుత్వం నుండి బడ్జెట్ రాని కారణంగా అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాం. ఆరియర్స్ చెల్లింపులపై సమ్మె నోటిసులు ఇచ్చారు. ఉగాదికి తొలి విడతగా 40% చెల్లించాలి. ప్రభుత్వం నుండి ఇంకా నిధులు రాలేదు. సిబ్బంది అక్కర్లేని విభాగాలలో పరిస్ధితులపై రివ్యూలు చేసి సిబ్బందిని కుదించే ప్రయత్నం చేస్తున్నాం. అలా అని ఏ ఒక్క ఉద్యోగిని ఉద్యోగంలో నుండి తీసేయమని అన్నారు. ఇవన్ని ఎంప్లాయిస్ యూనియన్లతో చర్చిస్తాం. ఒప్పిస్తాం. వివరిస్తా. ఆర్టీసి ఏడాదికి వస్తున్న ఆదాయం 5995 కోట్లు. బ్యాంక్, & హడ్కో లోన్స్ రూపంలో 3,380 కోట్లు అప్పు ఉంది. నిధులు లేక ఉద్యోగులకు, సంస్ధలో పలు పలువురు చెల్లించాల్సిన అమౌంట్లు 3,065 కోట్లు ఉంది. మొత్తం ఆర్టీసీ చెల్లించాల్సిన బకాయిలు 6,445 కోట్లు. గత మూడేళ్లుగా 40% డీజిల్ పెరిగినా కూడా ఆర్టీసిలో నష్టాలను తగ్గిస్తూ వచ్చాం కాని పెంచలేదని అన్నారు. ఆర్టీసి కార్మికులు ఆర్టీసి నష్టాలకు కారకులు కాదు. కొత్త బస్సులు వెయ్యి వరకు కావాలి. అన్నిటిలో ఆదా చేస్తూ ఆదయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఎమ్వి టాక్స్ ఐదేళ్ల పాటు తగ్గిస్తే ఏడాదికి 300 కోట్లు ఆదా అవుతుందని అన్నారు. 500 కోట్లు పాత బస్సుల స్దానంలో కొత్త బస్సుల కొనుగోలుకు సహాయం అందించాలి. 3500 కోట్లు ప్రభుత్వం సహాయం
అందిస్తే చాలా వరుకు ఆర్టీసి బయటపడుతుంది. ఆర్టీసీ చార్జీలు 30% పెరిగితే తప్ప నష్టాలనుండి బయటపడలేమని అయన అన్నారు. చార్జీల పెంపుపై నివేదిక తయారు చేస్తున్నాం. త్వరలో ప్రభుత్వంతో చర్చిస్తామని అన్నారు.