YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మోడి సృష్టించిన శూన్యం

మోడి సృష్టించిన శూన్యం
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని పలాస,ఇచ్చాపురం, టెక్కలి,పాతపట్నం,ఆముదాలవలస,నరసన్నపేట నియోజకవర్గ నాయకులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా బూత్ వారీగా పోలింగ్ సరిళిపై అభ్యర్థులు నివేదిక ఇచ్చారు. అలాగే కౌంటింగ్ లో జాగ్రత్తలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేసారు. అయితే ఈ సమీక్షకు శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీ దేవి హజరు కాలేదు. కుటుంబసభ్యుడు మరణంతో సమీక్షకు ఆమో హాజరు కాలేదు. ఎమ్మెల్యే రాలేదని సమీక్షకు మిగతా నేతలు కుడా హజరు కాలేదు.  దాంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమీక్ష అని తెలిసి కూడా ఎందుకు రాలేందంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త రాజకీయాలను అధ్యయనం చేసే స్థాయికి చేరాలి. 37ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న మీరంతా మరింతగా రాణించాలి. రాష్ట్రానికి న్యాయం కోసమే తెలుగుదేశం పార్టీ ధర్మపోరాటం చేసింది. దేశవ్యాప్తంగా 
బిజెపి వ్యతిరేక శక్తులను కూడగట్టాం. బిజెపికి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగామని అన్నారు. మోడి వ్యతిరేక గాలిని దేశవ్యాప్తంగా ఉధృతం చేశాం. ఓటమి నైరాశ్యంతోనే నరేంద్రమోడి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫ్రస్టేషన్ తోనే మోడి దిగజారి మాట్లాడుతున్నారు.  26 ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్ గురించి మాట్లాడుతున్నారు.  గత 5ఏళ్లలో తానేం చేశాడో నరేంద్రమోడి చెప్పాలి. చేసింది చెప్పేందుకేమీ లేదు కాబట్టే మోడి చౌకబారు విమర్శలు. దేశానికి రాబోయేది కొత్త ప్రధానే, మోడి ప్రధానిగా ఇకపై ఉండరని అన్నారు. భారత రాజకీయాల్లో హుందాతనం మోడి వల్ల కొరవడింది. ఈ విధమైన చౌకబారు వ్యాఖ్యలు,దిగజారుడు రాజకీయాలు గతంలో లేవు. జన్ ధన్- ఆధార్-మొబైల్ (జామ్) విధానం ఏమైంది..?  మేకిన్  ఇండియా, స్టార్టప్ ఇండియా ఏమైంది..? గుజరాత్ నమూనా విఫల నమూనాగా మిగిలింది. మొదట్లో గుజరాత్ నమూనా అని మోడి హోరెత్తించారు. ఇప్పుడా గుజరాత్ మోడల్ ప్రజల్లో ఘోర వైఫల్యంగా  తేలిందని అన్నారు. నాలెడ్జ్ 
ఎకనామిలో గుజరాత్  లేదు, మానవ వనరుల అభివృద్ధిలో గుజరాత్ లేదు. హైదరాబాద్ అభివృద్ధి ఎక్కడ, అహ్మదాబాద్ అభివృద్ధి ఎక్కడ..? గుజరాత్ మోడల్ అనేది మోడి సృష్టించిన శూన్యం తప్ప ఏమీలేదు. టిడిపితో పెట్టుకున్నప్పుడే మోడి పతనం ప్రారంభం అయ్యింది. నా సొంతం కోసం కాదు మోడితో నేను విభేదించింది. రాష్ట్రం కోసమే బిజెపిపై మనం తిరగబడ్డామని అన్నారు. 

Related Posts