యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బహుజన్ సమాజ్ పార్టీ ఛీప్ మాయావతి ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. బీఎస్పీ - ఎస్పీ పొత్తు కులాల కూటమి అని మోదీ వ్యాఖ్యానించడాన్ని మాయావతి తప్పుబట్టారు. తమది కులాల కూటమి అని మోదీ వ్యాఖ్యానించడం.. ఆయన అపరిపక్వతకు నిదర్శనం. ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వెనుకబాటు తరగతుల బాధలు, నొప్పి మోదీకి తెలియదు అని మాయావతి మండిపడ్డారు. మోదీ అలా వ్యాఖ్యానించడం సరికాదు అని బీఎస్పీ చీఫ్ పేర్కొన్నారు. మోదీ వెనుకబాటు కులంలో పుట్టి ఉంటే.. ఆర్‌ఎస్‌ఎస్ ఇవాళ ఆయనను ప్రధానిని చేసి ఉండేది కాదు అని మాయావతి తెలిపారు. మోదీ ఒక్కసారి గుజరాత్ వైపు చూస్తే బాగుంటుందన్నారు. గుజరాత్‌లో దళితులపై దాడులు జరుగుతున్నాయని, గౌరవప్రదంగా జీవించలేక పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు పెళ్లి చేసుకుంటే.. వారిని గుర్రపుబగ్గీపై కూడా ఊరేగకుండా అగ్రకులాలు అడ్డుకుంటున్నాయని మాయావతి పేర్కొన్నారు.