YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు చేదు అనుభవం

 ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు చేదు అనుభవం
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు చేదు అనుభవం ఎదురైంది. దక్షిణ ముంబైలోని ముంబా దేవి దర్శనం కోసం వచ్చిన ఆయన ఆలయంలోకి ప్రవేశించగానే భక్తులందరూ మోదీ..మోదీ..మోదీ అంటూ నినాదాలతో స్వాగతం పలికారు. టెంపుల్‌లోకి రాబర్ట్ వాద్రా అడుగుపెట్టగానే మోదీ జిందాబాద్, మాతా కీ జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆలయానికి పోలీసులు వచ్చి ఆయనను సురక్షితంగా బయటకు పంపించి వేశారు. ఈ సందర్భంగా వాద్రా మాట్లాడుతూ.. దేవీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడి వచ్చాను. ఆలయంలో రాజకీయాలు చేయడానికి రాలేదు. కుటుంబసభ్యులతో ఇక్కడి వచ్చి దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆలయంలో రాజకీయ కార్యకలపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహించకుడదని ఆయన పేర్కొన్నారు. 

Related Posts