
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఆడిన 10 సీజన్లలో ఎనిమిదోసారి సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. బ్రావో (2/19), జడేజా (2/23), దీపక్ చాహర్ (2/28), హర్భజన్ (2/31) బౌలింగ్ మెరుపులకు తోడు డుప్లెసిస్ (39 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 50), షేన్ వాట్సన్ (32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) అర్ధసెంచరీలతో ఢిల్లీపై 6 వికెట్ల తేడాతో చెన్నై గెలిచింది. ఇక ఆదివారం హైదరాబాద్‌లో జరిగే ఫైనల్లో మరోసారి చెన్నై, ముంబై తలపడనున్నాయి. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 147 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 38) మాత్రమే రాణించాడు. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 19 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా డుప్లెసిస్ నిలిచాడు.