YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆ నాలుగు రాష్ట్రాల్లే కమలాన్ని ముంచుతాయా

ఆ నాలుగు రాష్ట్రాల్లే కమలాన్ని ముంచుతాయా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

చాలామంది బీజేపీ హిందు వాదంతో ఈసారి కూడా గట్టెక్కుతుందని గుడ్డిగా నమ్ముతున్నారు. అలాంటి వారు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే... భారతీయ చరిత్రలో ఇంతవరకు ఏ పార్టీ గతంలో గెలిచిన అన్ని స్థానాలు రెండోసారి గెలవలేదు. మరో ముఖ్యమైన విషయం .... బీజేపీకి అవకాశం ఉన్న ప్రతిచోట గత టెర్ములో గెలిచేసింది. కాబట్టి ఈసారి బీజేపీ కోల్పోయే స్థానాలుంటాయే గానీ గెలిచే స్థానాలుండవు. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కానీ ఈసారి ఆ నాలుగు రాష్ట్రాల్లోనే 40 శాతం పైగా సీట్లు కోల్పోనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ భవిష్యత్తు చాలా అంధకారంగా తయారైంది.ముఖ్యంగా ఈ విషయం మోడీ పసిగట్టినందువల్లే ఎన్నికలు 7 దశల్లో పెట్టి ఎలాగైనా నెగ్గాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. తనకు అనుకూలంగా షెడ్యూల్ తయారుచేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాస్తవం ఏంటంటే.. ఎన్ని ప్రయత్నాలు చేసినా 2014లో ఉన్నంత ఊపు ఈసారి లేదు. హిందువాదలు ప్రతి ఏడాదీ తగ్గుతారే గానీ పెరగరు. గత సారి అవినీతిని భరించలేక దానిని నిర్మూలిస్తానని చెప్పిన మోడీ మాటలు విని జనం ఆయనకు గుద్దిపారేశారు. అందులో ఒక్క శాతం కూడా మోడీ నిజం చేయలేదు. అందుకే అవినీతి విషయంలో గాని, పరిపాలనను గాడిలో పెట్టే విషయంలో గాని మోడీ పూర్తిగా విఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో అతను తీవ్రంగా వెనుకబడ్డారు. అందుకనే మధ్యతరగతిపై ప్రయోగించిన రిజర్వేషన్లు కూడా పెద్దగా ఫలితాన్నివ్వని పరిస్థితి. దీంతో బీజేపీకి ఎటు చూసినా బ్యాడ్ న్యూసే వినిపిస్తోంది. ఎన్ని కూటములు కట్టినా, ఎన్ని మాటలు చెప్పినా... ఈ సోషల్ మీడియా యుగంలో మోడీకి మళ్లీ సంపూర్ణ మద్దతు దక్కడం కల్ల. చాలా సింపుల్ లాజిక్ ఏంటంటే... కాంగ్రెస్ కూటమిలో 22 పార్టీలు ఉన్నాయి. అతి తక్కువగా కాంగ్రెస్తో పాటు ప్రతి పార్టీకి పది సీట్లే లెక్కేసుకున్నా కూడా 220 సీట్లు వస్తాయి. ప్రాక్టికల్ గా చూస్తే కాంగ్రెస్కు 160-200 సీట్లు రానున్న నేపథ్యంలో బలమైన ప్రాంతీయ పార్టీలు పది దాకా కాంగ్రెస్ తో ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ ప్లస్ లో ఉంటే బీజేపీ మైనస్ లో ఉండనుంది. బీజేపీ కోల్పోయే ప్రతి లోక్ సభ సీటు కాంగ్రెస్ ది గాని, కాంగ్రెస్ కూటమిది గాని అయి ఉంటుంది. 

Related Posts