యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత వారం పాటూ టీడీపీ నేతలు హడావుడి చేశారు. ఆ పార్టీ అధినేత ఈవీఎంలు, వీవీప్యాడ్లపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దేశవ్యాప్త పర్యటనలు, జాతీయ స్థాయి నేతలతో చర్చలు సాగించారు. ఈ క్రమంలో టీడీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందనే ప్రచారం బాగా జరిగింది. ఆ తర్వాత సీన్ మారింది. ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగితే... ఏప్రిల్ 20 నుంచీ సీన్ మొత్తం వైసీపీ వైపు తిరిగింది. సోషల్ మీడియాలో, సర్వేల్లో అంతటా వైసీపీ గెలుస్తుందనీ, టీడీపీకి గట్టిగా 60 సీట్లు కూడా రావనే ప్రచారం ఊపందుకుంది. అంతే... ఒక్కసారిగా లోటస్ పాండ్‌కి నేతల క్యూ మొదలైంది. మొదట్లో వైసీపీ అధినేత జగన్ ఎవరితోనూ టచ్‌లో ఉండకుండా తన సొంత పనుల్లో నిమగ్నమయ్యారు. విహార యాత్ర కోసం స్విట్జర్లాండ్ వెళ్లి వచ్చారు. అలా ఆయన వచ్చారో లేదో ఇలా నేతల హడావుడి ఎక్కువైపోయింది. మనమే గెలుస్తున్నాం అంటూ... సీనియర్లతోపాటూ... చోటా మోటా నేతలు కూడా వెళ్లి జగన్‌ను కలిసి... తమ తమ సర్వే రిపోర్టులు చూపిస్తూ... సందడి చేశారు.వచ్చాక సీన్ మరింత మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏంచెయ్యాలి, ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, కేబినెట్ బెర్తులను ఆశిస్తున్నదెవరు, ఏయే అధికారులను ట్రాన్స్‌ఫర్ చెయ్యాలి ఇలాంటి అంశాలపై చర్చ ఎక్కువైంది. ఇదే సమయంలో ఆశావహుల సంఖ్య పెరిగింది. తెల్లారింది మొదలు, రాత్రి 10 గంటల వరకూ ఎవరో ఒకరు జగన్ ఇంటికి వెళ్లి ఆయన్న కలిసి తమ వినతులు చెప్పుకుంటున్నారు. ఇలా వచ్చే వాళ్లలో వైసీపీతోపాటూ... ఇతర పార్టీల నేతలు కూడా ఉంటున్నారని తెలిసింది. ఎవరు ఏం చెప్పినా సహనంతో వింటూ... ఔననీ, కాదనీ ఏదీ చెప్పకుండా చిరునవ్వుతో సాగనంపుతున్నారట జగన్. దీని వెనక కొందరు సీనియర్ల సలహాలున్నాయని తెలుస్తోంది. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయనీ, వెంటనే ఏ నిర్ణయమూ తీసేసుకోవద్దని జగన్‌కి అత్యంత నమ్మకస్తులైన సీనియర్లు కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది.జగన్ చెంతకు వస్తున్న నేతలను చూస్తున్న సన్నిహితులు ఎన్నికల్లో కూడా జగన్ ఇంత బిజీగా లేరని అంటున్నారట. జగన్‌కి రెస్ట్ లేకుండా పోతోందని కుటుంబ సభ్యులు ఫీలవుతున్నారట. వైసీపీ అధికారంలోకి రాగానే, ఏయే పార్టీల్లో ఎవరెవరు నేతలు వైసీపీలోకి రావాలనుకుంటున్నారో ఓ లిస్ట్ ఇప్పటికే తయారైనట్లు తెలిసింది. ఆ విషయం అలా ఉంచితే... ప్రస్తుతం జగన్ మే 23 నుంచీ ఏం చెయ్యాలన్న కార్యాచరణపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. కేబినెట్ కూర్పుతోపాటూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ముందుగా వేటిని నెరవేర్చాలన్న దానిపై ఫోకస్ చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రైతులకు మే నెలలోనే పెట్టుబడి సాయం ఇస్తానని ఎన్నికల్లో ప్రకటించిన జగన్... ముందుగా ఆ సాయం అందేలా చేసేందుకు... నిధుల సమీకరణకు ఏం చెయ్యాలన్నదానిపై ఓ ప్రణాళిక సిద్ధం చేయిస్తున్నట్లు తెలిసింది