YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హంగ్ వస్తే దీదీకి చాన్స్...

హంగ్ వస్తే దీదీకి చాన్స్...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

21 వ శతాబ్దంలో అంటే 2000 ఏడాది తర్వాత నుంచి భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతూ వచ్చాయి. అయితే అనేక కూటముల తర్వాత ప్రజలు కొంచెం విసిగి పోయారు. దీంతో ఫైనల్ గా ఒక్కసారి చూద్దాం... సింగిల్ పార్టీ ప్రధానిని గెలిపిద్దాం అని భావించారు. అదే సమయంలో మోడీ రూపంలో ఈ దేశంలో అతిపెద్ద సంఖ్యలో ఉన్న హిందువుల తమ మనసులో వేరే ఉద్దేశం పెట్టుకుని మోడీకి ఓటేయగా, ఆలోచనా పరులు అవినీతి తరిమేసేందుకు ఓటేశారు. దీంతో సంపూర్ణ మెజారిటీతో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. ప్రజలు వాస్తవానికి రిస్క్ చేశారు.అందుకే భారతీయులు సమీప భవిష్యత్తులో సింగిల్ పార్టీకి ఇక పట్టం కట్టరు. కూటమిలో వచ్చే గొడవల వల్ల ఆ పార్టీలకు నష్టం గానీ దేశానికి కాదు. అందరికీ భయం ఉంటుంది. కార్పొరేట్లు దేశాన్ని శాసించడం తగ్గుతుంది. అన్ని పార్టీలు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేస్తాయి. అందుకే దేశంలో రాబోయే ప్రభుత్వం హంగ్ ప్రభుత్వం. సరే హంగ్ వస్తే ప్రధాని మమతా బెనర్జీ అవుతుందని మీరు ఎలా చెబుతారు? అనేదేగా మీ అనుమానం. ఎలా అంటే ప్రస్తుతం దేశంలోన్ని అన్ని జాతీయ పార్టీల కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉన్న పార్టీ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్. 42 సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్ల ో ఆమెకు 35 సీట్ల కంటే ఎక్కువ రానున్నాయి. ఇది ఎంత పెద్ద సంఖ్య తెలుసా.... దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా మమత బెనర్జీ పార్టీ తృణమూల్ ఉంటుంది. ఆ తర్వాతే బీఎస్పీ అయినా, ఎస్పీ అయినా, పట్నాయక్ పార్టీ అయినా ఉంటాయి. హంగ్ ప్రభుత్వం వచ్చినపుడు 200 సీట్లు పైన వస్తేనే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రధాని పదవి దక్కుతుంది. కానీ ఆ రెండు పార్టీలకు ఆ అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మద్దతు పలికే పెద్ద పార్టీలకు అవకాశం వస్తుంది. మరి ఆ అవకాశం మూడో పెద్ద పార్టీ అయిన మమత పార్టీకే ఉంటుంది. అందుకే చంద్రబాబు మమతా బెనర్జీకి అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. 

Related Posts