YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రూ.కోటి నిధులతో శివ సాగర్ బీచ్ కు పర్యాటక సొబగులు - జిల్లా కలెక్టర్. జె.నివాస్

రూ.కోటి నిధులతో శివ సాగర్ బీచ్ కు పర్యాటక సొబగులు - జిల్లా కలెక్టర్. జె.నివాస్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

శ్రీకాకుళం : ఏపి టూరిజం  విస్తరణ లో  భాగంగా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర్ సముద్ర తీరంలో రూ.కోటి నిధులతో  పర్యాటకుల కోసం కాటేజీలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్  మీడియా సమావేశంలో  వెల్లడించారు.  శివసాగర్ బీచ్ ను ఆయన సందర్శించిన సందర్బంగా అయన మాట్లాడుతూ గతంలో నిర్మించిన కాటేజీలు తితిలీ తుఫాను తాకిడికి నాశనమైందని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల సౌకర్యార్ధం మౌళిక వసతులు కల్పిస్తామన్నారు. ఏపి పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. బీచ్ లో సందర్శకుల తాకిడికి అనుగుణంగా సకల సౌకర్యాలు కల్పించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టేందుకు అధికారులను ఆదేశించామన్నారు. పర్యాటకుల కోసం ప్రత్యేక గదులు  
నిర్మించి   ఇబ్బందులు కలుగకుండా  చేస్తామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా తితిలీ తుఫాను లో పాడైన బారవలో ఏపి టూరిజం  రిసార్ట్స్ లను పునర్ నిర్మాణం చేస్తమన్నారు . పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

Related Posts