ఎన్నికల వస్తున్న నేపథ్యం లో రాజకీయ నాయకులు తమ వారసులను ఎన్నికల బరిలో దింపడానికి ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. ఇదే క్రమంలో ఎంపీ మురళి మోహన్ (ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి చెందిన 'రాజమహేంద్రవరం') తన కోడలిని వచ్చేఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. అయితే ఇదే ప్రక్రియలో ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తన కూతురు విజయలక్ష్మిని కూడా రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
అందుకు తగ్గట్టుగానే కోడెల పావులు కదుపుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోడెల శివప్రసాదరావు కుటుంబం కి గుంటూరు జిల్లా ప్రజలలో మంచి పేరు వుంది. అలాగే కోడెల శివప్రసాదరావు కూడా మంచి నాయకుడు గా ప్రజల అవసరాలను తీర్చేవాడు అని అందరూ అంటుంటారు ఆ ప్రాంతీయులు. అయితే ఇప్పుడు కోడెల మార్గం లోనే ఆయన కూతురు కూడా నడవనున్నారని రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగిడనున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన కూతురు విజయలక్ష్మిని సత్తెనపల్లి నుంచీ తాను కోడెల నరసరావు పేట నుంచీ పోటీ చేయాలని భావిస్తున్నారట. అయితే కోడెల గెలుపుకు కానీ ఆయన స్థానంలో పోటీ చేయాలనుకునే కుమార్తె గెలుపుకి గానీ నియోజకవర్గంలో ఎలాంటి ఢోకా ఉండదని కార్యకర్తలు, అక్కడి ప్రజలు చెప్తున్నారట.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒక కుటుంబం నుండి ఇద్దరికీ ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం ఇస్తారా? అని అనుమానం కనపడుతుంది.