ప్రపంచ మానవాళి ఆరోగ్యం పై నేడు ప్రతి ఓక్కరూ ప్రత్యేక దృష్టి సారించకపోతే భావితరాలు అనారోగ్య భారినపడే ప్రమాదం వున్నదని ముందుగానే హెచ్చరించిన మహామేధావి నైటింగెల్ ను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఎంఎల్ సి రాము సూర్యారావు చెప్పారు. స్ధానిక ఏలూరు ప్రభత్వ ఆసుపత్రి లో శనివారం నైటింగెల్ 199 వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఫ్లోరెన్స్ నైటింగెల్ సేవే ప్రధాన ధ్వేయంగా సమాజంలో పేదల కోసం పాటుపడ్డారని చెప్పారు. భారత దేశం లో మరణాల రేటు తగ్గించడంలో ఆమె సలహాలు ఎంతో దోహదపడ్డాయన్నారు. భారతదేశానికి ఆమె ఇతోధిక సేవలు అందించారన్నారు. ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే రోగాలు దరిచేరవని భారత్ లో ఆరోగ్యం సౌకర్యాలు మెరుగుపరచడం మీదే ఫ్లోరెన్స్ నైటింగెల్ దృఫ్టి పెట్టారన్నారు. తాను అనారోగ్యంగా ఉన్నప్పటికి తన ఆరోగ్యం కన్నా ఇతరుల ఆరోగ్యం మీదనే ఆమె శ్రద్ధ పెట్టేవారన్నారు. నర్సింగ్ వృతిలో ఉన్నవారిని చూస్తే ఆమెకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేదన్నారు. అంతన జీవిత చివరిక్షణం వరకూ ప్రజా ఆరోగ్యం గురించే నైటింగ్ ఇలోచించేవారన్నారు. ఆమె మరణించినా సేవానిరతిగల ప్రతి నర్సు లోనూ ఆమె కలకాలం జివించి ఉంటారన్నారు.స్త్రీలు ఈ సందర్భంగా నర్సింగ్ టైనింగ్ పొందుతున్న విద్యార్ధినిలకు కొవ్వొత్తులు వెలిగించి నైటింగెల్ కు శ్రద్దాంజలి ఘటిస్తు రోగులకు నిస్వార్ధతతో ప్రమతో కూడిన సేవలు అందిస్తామని ప్రతిజ్ఞ పూనారు.