యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు
స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రవీంద్రను వేదపండితులు ఆశీర్వధించగా...ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి..,
పట్టువస్త్రంతో సత్కరించారు. చంద్రబాబు సారధ్యంలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగేలా దీవించాలని ప్రార్ధించినట్లు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మోడీ
రాష్ట్రానికి, దేశానికి చేసిన పాపాలవలే శపలుగా మరి ప్రజల వ్యతిరేకతను కూడకట్టునరన్నారు. కేంద్రంలో బాబు నాయకత్వం వైపు ప్రజల చూపు ఉందని..ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కూడా
ఉందని అన్నారు. మోడీ, కేసీఆర్, జగన్ లు అన్ని సంస్థలను వాడుకున్న కూడా 23 వ తేదీన రాష్ట్ర ప్రజలు టీడీపీకి పట్టం కడుతారని ధీమా వ్యక్తం చేశారు