యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నూతన రాజకీయ వరవడికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో అత్యధిక ఎంపి స్థానాలు గెలుచుకునే అవకాశం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందువల్ల గతంలోని విభేదాలు పక్కన పెట్టి తమతో కలిసి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మధ్యవర్తులను రంగంలో దించుతున్నది. ముందుగా కాంగ్రెస్ పార్టీ వైపు జగన్ మనసు మరల్చడానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జిని రంగంలో దించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంటే వై ఎస్ జగన్‌కు అత్యంత గౌరవం ఉంది. తన కష్టకాలంలో తనకు మార్గదర్శనం చేసిన వారని ప్రణబ్‌ముఖర్జిని జగన్ ఆరాధిస్తారు. అందువల్ల జగన్‌ను సానుకూల పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జిని రంగంలో దించుతున్నది. ఈ రెండు పరిణామాలు జరిగితే రెండు రాష్ట్రాలలో కొత్త రాజకీయ సమీకరణాలు ప్రారంభం అవుతాయి.వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బద్ధ వ్యతిరేకి. ఆయనపై కుట్ర పన్ని జైలుకు పంపిందనే కసి ఆయనలో ఉంది. అయితే అప్పటిలో ఆ నిర్ణయాలలో భాగస్వాములైన వారు ఎవరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు. కాంగ్రెస్ పార్టీ కొత్త నాయకత్వంలో నడుస్తున్నది. పైగా బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోతేనే తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వై ఎస్ జగన్‌ను కోరనుంది. ముందుగా కాంగ్రెస్ పార్టీ వైపు జగన్ మనసు మరల్చడానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జిని రంగంలో దించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంటే వై ఎస్ జగన్‌కు అత్యంత గౌరవం ఉంది. తన కష్టకాలంలో తనకు మార్గదర్శనం చేసిన వారని ప్రణబ్‌ముఖర్జిని జగన్ ఆరాధిస్తారు. అందువల్ల జగన్‌ను సానుకూల పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జిని రంగంలో దించుతున్నది. ఈ రెండు పరిణామాలు జరిగితే రెండు రాష్ట్రాలలో కొత్త రాజకీయ సమీకరణాలు ప్రారంభం అవుతాయి.