యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
టిఆర్ఎస్ పార్టు గోడమీది పిల్లిలా వ్యవహరిస్తుండగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొత్త మిత్రుల కోసం ప్రయత్నాలు చేస్తుండగా బిజెపి నాయకులు టిఆర్ఎస్ పార్టీ తమతోనే కలిసి వస్తుందన్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ప్రచారం సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ టిఆర్ ఎస్‌తో దోస్తీకి స్నేహహస్తం చాచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఇందులో భాగంగానే కేసీఆర్‌తో ఎంతో సన్నిహితంగా ఉండే కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంను రంగంలో దించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పి.చిదంబరం త్వరలో టిఆర్ ఎస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల ధోరణి అవలంబించాల్సిందిగా కేసీఆర్‌కు సూచించే అవకాశం కనిపిస్తున్నది. చిదంబరం చెబితే కేసీఆర్ వినే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే వారి మధ్య చాలా కాలంగా మిత్రత్వం ఉంది. రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులతో ఉన్న విభేదాలు ఈ సందర్భంగా పక్కన పెట్టాలని చిదంబరం సూచించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా టిఆర్ ఎస్ సానుకూల ధోరణి వ్యక్తం చేస్తే రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉండే నాయకులను దూరం పెట్టేందుకు కూడా ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదరవచ్చు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో
ఆగిపోవాలనుకోవడం లేదు.