YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆర్టీసీని మూసివేయడమే అయన లక్ష్యం

 ఆర్టీసీని మూసివేయడమే అయన లక్ష్యం
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను చంద్రబాబు నాశనం చేశారు. మూడున్నర లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.పెండింగ్ బిల్లులు చెల్లింపుల కోసం సీఎస్ రివ్యూ చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటని 
వైకాపా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు.    ధర్మపోరాట దీక్ష పేరుతో ఆర్టీసీని చంద్రబాబు ఇష్టానుసారంగా వాడుకున్నారు.  ఆర్టీసీని 
మూసివేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ఆదుకుంటాం.  10 రోజుల్లో ఫలితాలు వస్తుంటే కేబినెట్ మీటింగ్ ఎందుకు ?  పెండింగ్ బిల్లులు, భూ 
సేకరణ కోసమే కేబినెట్ మీటింగని అయన అన్నారు.  గతంలో ఎన్నికల తర్వాత మహానేత వైయస్ఆర్ ఏ రోజు కేబినెట్ మీటింగ్ పెట్టలేదు.  చట్టం ,రాజ్యాంగం పై నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు. 
డేటాను దొంగిలించిన వ్యక్తులను ..ఈవీఎంలను దొంగిలించిన వ్యక్తులను ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇన్ని రోజులు దాచడం ఎంతవరకు కరెక్ట్ ? వారిని..ప్రభుత్వ పెద్దల ఇళ్లలోనే దాచి పెట్టారని అన్నారు.  
రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ బిల్లులు, పరిశీలనలో ఉన్నటువంటివి 3 లక్షల 46 వేల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దాదాపుగా 3.5 లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండని అయన అన్నారు.  రాష్ట్రాన్ని బాధ్యతగా నడపాల్సిన చంద్రబాబు ఎలాగ నిర్వీర్యం చేశారో, ఎన్నికల లబ్ధి పొందటానికి ఎలాగ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. 3.5 లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంటే ప్రభుత్వం నడిపే అర్హత చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నిస్తున్నాం.   జీతాలు, పెండింగ్ లో ఉన్న రుణ అప్లికేషన్స్, ట్రాన్స్ పోర్టు అలవెన్స్, అద్దెల చెల్లింపు, డైట్ చార్జీలు, ఇంధన ఛార్జీలు, పేద ప్రజలకు సబ్సిడీలు అన్నీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. వివిధ రంగాలకు చెల్లించాల్సిన సబ్సిడీలే రూ.828 కోట్లు ఉన్నాయి. హాస్టల్ బిల్లులు రూ.78 కోట్లు పెండింగ్ లో 
ఉన్నాయి. ఈపాస్ బిల్లులు రూ.1,240 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా వివిధ కార్పొరేషన్స్ కు గ్రాంట్ గా ఇవ్వాల్సిన  డబ్బే రూ.4,800 కోట్లు ఉందని అన్నారు. ఇవికాకుండా వివిధ 
పథకాల కోసం పునరావాస కాలనీల కోసం భూసేకరణకు చెల్లించాల్సిన డబ్బు ఇప్పటికిప్పుడు రూ.880 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఒక్క భూసేకరణకే రూ.693 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి 
ఉంది. ఈ డబ్బులు రాక ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.  రాష్ట్ర శ్రేయస్సు కోసం భూములు ఇచ్చిన వారి గురించి (నిర్వాసితులు) ప్రభుత్వం ఆలోచించటం లేదు.  నిర్మాణ రంగంలో తీసుకుంటే
29వేల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. రూ.8,200 కోట్లకు పైగా వివిధ నిర్మాణాలు చేపట్టిన వారికి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.  ఈ పరిస్థితి చూసి ఏప్రిల్ 16న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు ఒక 
రివ్యూ చేశారు. కొన్ని ప్రాధాన్యత బిల్లులు, అత్యవసర బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ అందులో ఎలాంటి మార్పు రాకపోవటంతో ఏప్రిల్ 23న మళ్లీ అధికారులను పిలిచారు. వివిధ 
రూపాల్లో బిల్లులు చెల్లించకపోవటమే గాక కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ లో కూడా అలాగే పెండింగ్ లో ఉన్నాయి.  రూ.43 వేల కోట్లకు పైగా చెల్లించాల్సిన బిల్లులు చూస్తే.. అంత భారం మనపై ఉంటే.. 
ఖజానాలో మాత్రం రూ.9,000 కోట్లు మాత్రమే ఉన్నట్లు సీఎస్ తెలియజేయటం జరిగిందని అన్నారు.  వివిధ బ్యాంకుల నుంచి తాకట్టు పెట్టి తెచ్చిన లోన్లు, ఓవర్ డ్రాఫ్ట్ పై ఆరా తీసిన సీఎస్ ఆందోళన 
వ్యక్తం చేశారు. ఎక్కడకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీసుకువెళ్తున్నారని ఆయన అసంతృప్తి తెలియజేశారు.   ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు తన స్వప్రయోజనాలకు వాడుకోవటం వల్లనే ఈ పరిస్థితి రావటం 
జరిగిందని గడికోట మండిపడ్డారు.  - గతంలో సీఎఫ్ఎంఎస్ (సెంట్రలైజ్ ఫండ్స్ మేనేజ్మెంట్ సిస్టం) ప్రవేశపెట్టడం జరిగింది. దాని పని చేయకుండా చంద్రబాబు అడ్డగోలుగా ఇన్వాల్వ్ అవ్వటం వల్లనే ఈ 
పరిస్థితి రావటం జరిగిందని గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.   ఫైనాన్స్ వ్యవహారాలకు సంబంధించి గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ను,  ట్రెజరీని, పీఈఓను చంద్రబాబు డమ్మీ 
చేశారు.   కాంట్రాక్టు బిల్లులు ఎన్నికల్లో ఎవరైతే నిధులు ఇవ్వాలనుకుంటారో వారిదగ్గర చంద్రబాబు పర్సంటేజీలు తీసుకొని వాళ్లకు బిల్లులు వచ్చేలా ఆదేశాలు ఇవ్వటం వల్లనే రాష్ట్రానికి ఈ ఆర్థిక 
పరిస్థితి వచ్చిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.  ఫైనాన్స్ సెక్రటరీ వద్ద మాత్రమే లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఉండాలి. కానీ సీఎఫ్ఎంఎస్ సంస్థకు తనకు అనుకూలమైన సీఈఓను నియమించి తనకు కూడా 
లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఇవ్వటం జరిగింది. తద్వారా నిధులు వివిధ రూపాల్లో డైవర్ట్ చేశారు. కార్పొరేషన్ లోన్లు కూడా డైవర్ట్ చేసుకొని తమకు సంబంధించిన వ్యక్తులకు బిల్లులు చెల్లించారు. వారి వద్ద 
నుంచి లంచాలు తీసుకొని భవిష్యత్ లో రాష్ట్రానికి వచ్చే నష్టాన్ని గ్రహించక వాళ్ల స్వార్థం కోసం బిల్లులు చెల్లించారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిర్వీర్యం చేశారు. ఇలా చేయటం ప్రైవేటు వ్యక్తికి 
బాధ్యతలు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని అయన అన్నారు.  సీఎఫ్ఎంఎస్ సంస్థ లక్ష్యం ఏమిటి అంటే.. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. దీని ద్వారా పారదర్శకంగా జవాబుదారీగా ఉండాలి. 
అత్యవసరంగా బిల్లులు ఉన్నాయో వాటి కోసం ఈ సీఎఫ్ఎంఎస్ ను ప్రవేశపెట్టారు. ఎన్ఐటీకి దీన్ని అప్పజెప్పారు. విభజన తర్వాత సాఫ్ట్ ఇండియా అనే సంస్థకు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 
ఉన్నప్పుడు సీఎఫ్ఎంఎస్ బాగా పనిచేసింది. విభజన తర్వాత ఆర్థికశాఖను తన ఆర్థిక లావాదేవీల కోసం చంద్రబాబు గాడి తప్పించారు.  క్రమబద్ధీకరణలో ఇవ్వాల్సిన బిల్లులను  గాడితప్పించారు. 
నిబంధనల ప్రకారం అత్యవసరంగా పనులకు, ముందుగా నిర్ధేశించిన ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాల్సిన బిల్లులను ఇవ్వని పరిస్థితి. ఈ సీఎఫ్ఎంఎస్ సంస్థను పూర్తిగా అవినీతిపరం చేశారు. కొందరు 
కాంట్రాక్టు ఉద్యోగులకు రెండుసార్లు రూ.200 కోట్లు చెల్లించారు. దీనిపై నిలదీస్తే ఆ నిధులను వెనక్కితెచ్చారు. డబుల్ ఎంట్రీ బిల్లులు అరికట్టాలని ఏర్పాటు చేస్తే వీరి స్వప్రయోజనాల కోసం దీన్ని 
నిర్వీర్యం చేశారు.   వివిధ శాఖల నుంచి 42 మందిని రిక్రూట్ చేసుకున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి 43 మందిని 145 మందిని రిక్రూట్ చేసుకున్నారు. రిక్రూట్ చేసుకున్న వారంతా 
కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా తీసుకున్నారని వీరికి రిజర్వేషన్ సిస్టం కూడా లేదని శ్రీకాంత్ రెడ్డి వివరించారు. ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించారు.   ఎన్నికల కోడ్ 
సమయంలోనూ ఈ కాంట్రాక్ట్ సంస్థకు చెందిన వారిని చంద్రబాబు ఆఫీస్ కు పిలిపించుకొని ఎన్నికల్లో కమీషన్ ఇవ్వదలుచుకున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించమని ఆదేశాలు ఇచ్చారు. ఇలా 
చంద్రబాబు చేయటం వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. చిన్న చిన్న కాంట్రాక్టర్లు.. చిన్న చిన్న నిర్మాణాలు చేసేవారు అప్పులు చేసి పనులు చేశారు. బిల్లుల కోసం వారు తిరగాల్సిన పరిస్థితి 
వచ్చిందంటే ఈ ప్రభుత్వం చేసిన దౌర్భాగ్య పరిస్థితి వల్లనే అని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts