యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో అధికార బదిలీ వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.ఈ నెల 23 న ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపద్యం లో పోలింగ్ పూర్తి అయిన నాటి నుంచి లెక్కలు డొక్కలు ఎన్ని వేసుకున్నా.. ఏపీలో అధికారం జగన్ దేనన్న మాట బలంగా వినిపిస్తోంది. ఓట్లు వేసిన వారికి సంబంధించిన నిర్వహించిన శాంపిల్ సర్వేలు సైతం జగన్ చేతికే పవర్ అన్న వేళ.. బాబు బ్యాచ్ ఢీలా పడింది.ఈ వాదనలోని ప్రధాన లోపం ఏమంటే.. మోడీ బ్యాచ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలు లేనప్పుడు మాత్రమే ఇప్పుడు వినిపిస్తున్న వాదనంతా వర్క్ వుట్ అయ్యేది. ఒకవేళ మోడీ ప్రభుత్వం పవర్లోకి వస్తే బాబుకు ఎలాంటి ఛాన్స్ ఉండకపోగా.. దీదీ.. కుమారస్వామితో సహా ఆయన మిత్రులకు కొత్త ఇబ్బందులు ఖాయం. ఒకవేళ.. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం రాకున్నా.. థర్డ్ ఫ్రంట్ పురుడు పోసుకున్నా.. బాబుకు సానుకూల పరిస్థితులు ఉంటాయని చెప్పటం కష్టమే. ఎందుకంటే.. పవర్ ఉన్నోడి మాటకు.. పవర్ లేనోడి మాటకు ఉండే విలువ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత స్నేహితుడైనా వంగతోట రూల్ పవర్ లేనోడికి వర్తిస్తుందన్న విషయాన్ని బాబు బ్యాచ్ మిస్ అవుతుందని చెప్పక తప్పదు.