మావోయిస్టులు నిన్న ఏవోబీ (ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు)లో మందుపాతర పేల్చిన ఘటన నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఏవోబీలో మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అరుణ, నవీన్ మకాం వేసినట్టు పోలీసులకు సమాచారం ఉంది. దీంతో, కూంబింగ్ ముమ్మరం చేశారు.