కమలహాసన్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'దేవర్ మగన్' (క్షత్రియపుత్రుడు) ఒకటిగా కనిపిస్తుంది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి వచ్చిన కమల్, అందుకు సంబంధించిన సన్నాహాలను మొదలెట్టినట్టుగా తెలుస్తోంది. తొలి షెడ్యూల్ ను పొల్లాచ్చి లో ఆరంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. 'భారతీయుడు 2' ప్రాజెక్టు ఆగిపోవడం వల్లనే కమల్ ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి.