యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
'ఒక సినిమా ఆఫర్ వచ్చినప్పుడు అది చేస్తానా? లేదా? అన్నది ఐదు నిమిషాల్లో తేల్చేస్తాను..' అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ''నేను మొదటి నుంచీ అంతే.. ఏ విషయాన్నీ నాన్చను. వెంటనే నిర్ణయం తీసేసుకుంటాను. సినిమాల విషయంలో కూడా అంతే.. కథ వినగానే ఏదో ఒకటి చెప్పేస్తాను. 'తర్వాత చెబుతాను, మళ్లీ చెబుతాను' వంటి మాటలు చెప్పను'' అని చెప్పింది రకుల్.