YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరులో లోకేష్ వ్యూహాం పనిచేస్తుందా

చిత్తూరులో  లోకేష్ వ్యూహాం పనిచేస్తుందా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చంద్రగిరి. ఇది బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. ఆయ‌న స్వగ్రామం నారావారిప‌ల్లె ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంది. ఏపీకి చంద్రబాబు 
సీఎం అయినా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఆయ‌న పార్టీని గెలిపించుకోలేక‌ పోతున్నారు. ఇక్కడ నుంచి వైసీపీ నాయ‌కుడు చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే, ఈయ‌న త‌ర‌చుగా చంద్రబాబును నేరుగా విమ‌ర్శించ‌డం, వైసీపీ త‌ర‌ఫున ఫైర్ బ్రాండ్‌గా వ్యాఖ్యలు గుప్పించ‌డంలోను పేరు తెచ్చుకున్నారు. ఇక‌, 2017 నాటి అసెంబ్లీ స‌మావేశాల్లో తీవ్రస్థాయిలో మాట‌ల యుద్ధం చేసి స్పీక‌ర్ ఆగ్రహానికి కూడా గురై.. స‌స్పెండ్ కూడా అయ్యారు. అయినా కూడా ప‌లు సంద‌ర్భాల్లో మీడియాలో వ్యాఖ్యలు సంధిస్తూ.. సెంట‌రాఫ్‌ది రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీకి కొర‌క‌రాని కొయ్యగా మారారు.సొంత నియోజ‌క‌వ‌ర్గంలో చాలా విష‌యాల్లో స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యే ఉండ‌డంతో టీడీపీ ఆట‌లు సాగ‌డం లేదు. దీంతో ఎలాగైనా.. చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలో చెవిరెడ్డి భాస్కర‌రెడ్డికి చెక్ పెట్టాల‌ని చంద్రబాబు గ‌ట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించారు. వాస్తవానికి కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 
గ‌తంలో కాంగ్రెస్ నాయ‌కురాలు, ప్రస్తుతం టీడీపీలో ఉన్న గ‌ల్లా అరుణ‌కుమారి గెలుపొందారు. అయితే, 2014 రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో ఆమె టీడీపీలోకి చేరి.. ఆ పార్టీ టికెట్పై పోటీ చేశారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన చెవిరెడ్డి.. 4 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇక‌, ఆ త‌ర్వాత ఇక్కడ నుంచి అరుణ నిష్క్రమించ డంతో రెండేళ్ల కింద‌టే పుల‌వ‌ర్తి వెంక‌ట మ‌ణి ప్రసాద్‌ ఉర‌ఫ్ నానిని రంగంలోకి దింపారు చంద్రబాబు.మ‌రోప‌క్క, పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శిగా మంత్రి నారా లోకేష్ కూడా ఇక్కడ వ్యూహాలు ర‌చించి అమ‌లు చేశారు. దూ కుడు ప్రద‌ర్శిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కి ఎక్కడిక‌క్కడ ముకుతాడు వేసే ప్రయ‌త్నం చేశారు. రాష్ట్రంలోని ఏ ప్రతి ప‌క్షం ఎమ్మెల్యేపైనా లేన‌న్ని కేసులు చెవిరెడ్డిపై న‌మోద‌య్యాయంటే ప‌రిస్థితి ఎలాంటిదో అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే, టీడీపీ ఎలా నిలువ‌రించేందుకు ప్ర‌య‌త్నించిందో.. అంత‌కంటే రెట్టింపు వేగంతో త‌న హ‌వాను ప్ర‌ద‌ర్శించాడు చెవిరెడ్డి ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా త‌న దూకుడును 
ప్ర‌ద‌ర్శించాడు. దీంతో రాష్ట్రంలో హాట్ హాట్‌గా ఈ నియోజ‌క‌వ‌ర్గం వార్త‌ల్లో నిలిచింది.ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల‌కు ముందునుంచే పుల‌వ‌ర్తి వ‌ర్సెస్ చెవిరెడ్డి హోరా హోరీ పోరు సాగింది ఒక‌రిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు ప్రయ‌త్నించారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ సింబ‌ల్‌తో కూడిన గోడ‌గ‌డియారాల‌ను పంచితే.. పుల‌వ‌ర్తి ఏకంగా మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలోని పల్లెల్లో ఆరు నెల‌లుగా రెండు పార్టీ నేత‌ల మ‌ధ్య పెద్ద యుద్ధ వాతావ‌ర‌ణ‌మే న‌డిచింది. పోలీసులు కూడా ఇక్క‌డ ఈ రెండు పార్టీ నేత‌ల మ‌ధ్య స‌యోధ్య చేయ‌లేక చేతులు ఎత్తేశారు. చిన్న విష‌యంలో సైతం ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గే ప‌రిస్థితి లేదు. ఇక‌,ప్ర‌తి విష‌యంలోనూ ఆధిప‌త్య ధోర‌ణి సాగింది. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లోనూ వివాదాలు చుట్టుముట్టాయి. ఇక‌, ఎన్నిక‌ల స‌మయానికి ఈ వివాదాలు మ‌రింత‌గా పెరిగాయి. ప‌లు బూతుల్లో ఘ‌ర్షణ‌లు కూడా చోటు చేసుకున్నాయి.పోలింగ్ ముగిశాక ఎవ‌రికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ ఇక్కడ టీడీపీ గెలుపుపై ఆరాలు తీస్తే… వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏకంగా నివేదిక‌లు తెప్పించుకోవ‌డంతో పాటు చెవిరెడ్డి గెలుస్తున్నాడ‌ని కూడా పార్టీ నేత‌ల‌కు చెప్పారు. ఈ నేప‌థ్యంలో గెలుపు మాదంటే మాదేన‌ని ఇరు ప‌క్షాలూ ధీమా వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు ఈ సారి అయినా సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని గెలిపించుకోలేక పోతే ఆయ‌న‌కు ఇది పెద్ద మ‌చ్చే. మ‌రి ఫైన‌ల్‌గా ఏం జ‌రుగుతుందో చూడాలి.

Related Posts