యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం సమావేశమయ్యారు. మంగళవారం కేబినెట్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రితో చర్చించారు. భేటీ జరిగిన సమయానికి క్యాబినెట్ సమావేశానికి ఈసీ నుండి ఇంకా అనుమతి రాలేదని సీఎం చంద్రబాబు కి ఎల్వీ చెప్పినట్లు సమాచారం. అయితే, సోమవారం సాయంత్రానికల్లా మంత్రిమండలి సమావేశంపై ఈసీ నుంచి అనుమతి వచ్చే అవకాశముందని ఉన్నతాధికారులు సీఎంకు చెప్పారు. దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశం ముగియడంతో సీఎస్ ఎల్వీ బయటకు వెళ్లిపోయారు. ఒకవేళ ఈసీ అనుమతి రాకపోతే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు అధికారులతో సమీక్ష చంద్రబాబు నిర్వహిస్తారని సమాచారం. కరువు, ఫోని తుఫాన్, తాగునీటి పై ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో మాత్రమే అయన సమీక్ష నిర్వహించనున్న్లు సమాచారం.