YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

స్వతంత్ర భారత్‌లో ‘తొలి ఉగ్రవాది హిందువే’: కమల్‌ హాసన్‌

స్వతంత్ర భారత్‌లో ‘తొలి ఉగ్రవాది హిందువే’: కమల్‌ హాసన్‌

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యుం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారత్‌లో ‘తొలి ఉగ్రవాది హిందువే’ అని వ్యాఖ్యానించారు. నాథూరామ్‌ గాడ్సేను ఉద్దేశిస్తూ ఆయన ఈ విమర్శలు చేశారు దేశంలోని ప్రజలంతా సమానత్వంతో జీవించాలని  కోరుకునే భారతీయుల్లో తానూ ఒకడినని అభిప్రాయపడ్డారు. త్రివర్ణ పతాకంలోని మూడు రంగులు వివిధ వర్గాల విశ్వాసాలను సూచించినట్లుగానే తాను కూడా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటానని వ్యాఖ్యానించారు. ‘‘ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్న కారణంగా నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. గాంధీ విగ్రహం ఎదుట నిలబడి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది ఒక హిందువు.. ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సే. అప్పటి నుంచే ఈ ఉగ్రవాదం ప్రారంభమైంది’’ అని కమల్‌ హాసన్‌ చెప్పుకొచ్చారు. ఒక గాంధేయవాదిగా ఆయన హత్యకు గల కారణాలను తెలుసుకోవాలనుకుంటున్నానని కమల్‌ అన్నారు.గతంలోనూ కమల్‌ హాసన్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. 2017 నవంబరులో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘హిందూ తీవ్రవాదం’ అనే పదజాలం ఉపయోగించారు. కమల్‌ వ్యాఖ్యల్ని అప్పట్లో భాజపాతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాయి. 

Related Posts