YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నక్సల్స్ ఎదుర్కొనేందుకు చెక్ ....రంగంలోకి దంతేశ్వరి బృందం సేవలు

నక్సల్స్ ఎదుర్కొనేందుకు చెక్ ....రంగంలోకి దంతేశ్వరి బృందం సేవలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోతున్న మావోయిస్టులకు చెక్ పెట్టడానికి భద్రతా దళాలు సరికొత్త ప్రణాళికలతో ముందుకొస్తున్నాయి. నక్సల్స్ చర్యలను సమర్థంగా తిప్పికొట్టే చర్యల్లో భాగంగా మహిళా కమాండోలతో ఓ బృందాన్ని ప్రవేశపెట్టాయి. 30 మందితో కూడిన ఈ యాంటీ నక్సల్స్ కమాండో బృందానికి ‘దంతేశ్వరి లఢకే’ అని పేరు పెట్టారు. మావోల ప్రభావం అధికంగా ఉన్న బస్తర్, దంతేవాడ ప్రాంతాల్లో ఈ మహిళా కమాండోల బృందం సేవలు అందించనుంది. ఈ ప్రత్యేక బృందంలో 10 మంది మాజీ నక్సలైట్లు ఉండటం గమనార్హం. గతంలో నక్సలైట్లుగా పనిచేసి లొంగిపోయిన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. దంతేశ్వరి బృందంలోకి తీసుకున్నారు. పురుషులతో కూడిన కమాండోల బృందానికి అదనంగా ఈ మహిళా కమాండోల బృందం సేవలు అందిస్తుందని బస్తర్ ఐజీ వివేకానంద సిన్హా తెలిపారు. వాళ్లు సమర్థంగా విధులు నిర్వహిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళా సాధికారితకు మరో ఉదాహరణగా దీన్ని ఆయన అభివర్ణించారు.ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అంతకంతకూ విస్తరిస్తున్నారు. పలు హింసాత్మక ఘటనలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మందుపాతరల పేలుళ్లతో హడలెత్తిస్తున్నారు. కొద్ది రోజుల కిందట పోలీస్ వ్యాన్‌ను పేల్చేసిన ఘటనలో 16 మంది పోలీసులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్రానికి తలనొప్పిగా మారిన మావోల వ్యవహారంలో భద్రతా బలగాలు మరింత పకడ్బందీగా వ్యూహాలు అమలు చేసే పనిలో పడ్డాయి. 

Related Posts