యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ముంబయిలో 23 ఏళ్ల యువతికి ఎదురైన చేదు అనుభవం ఇది. ములంద్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలోకి డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన ఆమెకు 35 ఏళ్ల వ్యక్తి తన మర్మాంగాన్ని చూపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె అతడి వీడియో అదంతా వీడియో తీయడంతో అతడు బయటకు వెళ్లిపోయాడు. అయితే, ఆమె మాత్రం అతడిని వదిలిపెట్టలేదు. ఏటీఎం బయట ఉన్న పోలీసులకు ఆ వీడియో చూపింది. దీంతో పోలీసులు అతడిని అనుసరించి అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోను ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ‘‘సమయం తెల్లవారుజాము 3 గంటలు. ఏటీఎంలోకి వెళ్లిన నాకు ఓ వ్యక్తి తన మర్మాంగాన్ని బయటకు తీసి చూపించాడు. ఆ తర్వాత నన్ను తాకేందుకు ప్రయత్నించాడు. డబ్బులు కూడా ఇస్తానన్నాడు. ఆ సమయంలో నేను చాలా భయపడ్డాను. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మొబైల్‌తో వీడియో తీశాను. ఏటీఎం నుంచి బయటకు వెళ్లాక లక్కీగా పోలీస్ వాహనం కనిపించింది. పోలీసులకు ఈ వీడియో చూపించాను. వాళ్లు అతన్ని ఫాలో అయ్యారు. అతన్ని పోలీసులు పట్టుకున్నారో లేదో నాకు తెలీదు. కానీ, ఏటీఎంలో కెమేరాలు ఉంటాయని తెలిసి కూడా అతడు మర్మాంగాన్ని చూపడానికి తెగించాడు. ఇది ఎప్పటికి ఆగుతుంది?’’ అని ఆమె ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.