YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వామ్మో...ఇవేమి రోడ్లు

వామ్మో...ఇవేమి రోడ్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

వర్షాలకు తారు రోడ్డుపై ఇసుక మేట వేసింది. వైజాగ్ లోని జివిఎంసి రెండో వార్డు పరిధి అంబేద్కర్‌ విగ్రహం నుండి చినగదిలి సాయిబాబా ఆలయం వైపు వెళ్ళే సూర్యతేజ నగర్‌ మలుపు వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై పెద్ద ఎత్తున ఇసుక చేరి మేట వేసి ఉండిపోయింది. అది కాస్త ఎండిపోవడంతో పొడి ఇసుకగా మారి వచ్చే పోయేవారిని పడేస్తోందివెంటనే దానిని తొలిగించక పోవడంతో వాహనాలు స్కిడ్‌ అవుతున్నాయి. ఆదమరిచి ఆ రోడ్డులో వాహనాలు నడిపామా ఆసుపత్రిపాలవ్వాల్సిందే. దీంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురై పడిపేవారు, గాయాలపాలవుతున్నారు. . దీనితో వ్యక్తిగత రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షం పడి తగ్గిన వెంటనే మేట వేసిన ఇసుకను, మట్టిని జివిఎంసి పారిశుధ్య సిబ్బంది తొలిగించి ఉంటే ఎటువంటి సమస్య లేకపోను. మేటవేసిన ఇసుక, మట్టి ఎండిపోవడంతో వాహనదారులు ఏమాత్రం జాగ్రత్తలు పాటించక పోయినా, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఇదే ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపులా భవన నిర్మాణ సామగ్రి అయిన ఇసుక, పిక్క, ఇటుక అమ్మకాలు సాగిస్తు లాభాలు ఆర్జింస్తున్నారు. వాహనచోదకులు కోసం ఏ మాత్రం ఆలోచించడం లేదు. పెద్ద వర్షం పడినా ఆ వర్షం నీరుతో ఇసుక, మట్టి కొట్టుకు వచ్చి రోడ్డుపై మేట వేస్తుంది. రోడ్డంతా ఇసుక మేట వేయడంతో, పగటి పూట వాహనదారులు గమనించి జాగ్రత్తగా ప్రయాణిస్తున్నారు. రాత్రి సమయంలో ఈ మలుపులో మేటవేసిన ఇసుకను గమనించక పోవడంతో వేగంగా వచ్చే వాహనదారులు స్కిడ్‌ అయ్యి రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.నాలుగు రోజులుగా ముగ్గురు ద్విచక్రవాహనదారులు పడిపోయి గాయాలపాలయ్యారు. ఈ రహదారిలో కొత్తగా ప్రయాణించేవారు అయితే ఇక అంతే సంగతులు, ఏది ఏమైనప్పటకి ఈ మార్గంలో వాహనదారులు ఆదమరచి ఉండకూడదు. అప్రమత్తంగా ఉండి బండి నడపాలి. అపుడే గమ్యం చేరుకోవచ్చు. ఆదమరిచి నడిపితే గాయాలు పాలై, ఆసుపత్రిని సంప్రదించడమే ఇప్పటికైనా సంబంధిత జివిఎంసి అధికారులు స్పందించి పెద్ద ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరగక ముందే రోడ్డుపై పోగులగా ఉన్న ఇసుక మేటను తొలిగించాలని, అలాగే అదే ప్రాంతంలో భవన నిర్మాణ సామగ్రి అమ్మకాలను వేరే చోటుకు తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 

Related Posts