యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గరుడ పురాణం పేరుతో నీతివాక్యాలు వల్లించి..ఇప్పుడు కనిపించకుండా పోయాడు.. ఆంధ్రప్రదేశ్ లో దత్తపుత్రుడిలా దర్జాగా ఉన్నాడని తెలంగాణా పోలీసుల సమాచారం. ఆయనే హీరోగా చెప్పుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ. తెల్లకాగితాల మీద 20 లక్షల రూపాయలు రవిప్రకాష్ కు ఇచ్చినట్టు రాసిన డాక్యుమెంట్లతో మేనేజ్ మెంట్ బదలాయింపు అడ్డుకున్న కుట్రలో శివాజీ భాగస్థుడు అయ్యాడు. ఈ విషయ పై తెలంగాణ పోలీసుల దగ్గర పక్క సమాచారం ఉంది.160 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చినా ఏ మాత్రం స్పందించకుండా.. రాజకీయ వత్తిడిలతో బయటపడాలని చూస్తున్నాడు శివాజీ. కేసులు ఎత్తివేస్తే…..అప్రూవర్ గా మారుతానని కూడా కాళ్ళబేరానికి కూడా వచ్చినట్టు సమాచారం. అయినా తెలంగాణ పొలిసులు తమ ముందు హాజరు అయి వివరణ ఇవ్వాలని శివాజీ భావిస్తున్నాడు. ఒకవేళ పోలీసుల ముందు హాజరు అయితే అరెస్ట్ చేస్తారని భయంతో..కోర్టు ద్వారా నాట్ టు అరెస్ట్ ఆర్డర్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. కోర్టుకు వేసవి సెలవులు కావడంతో్ ఆ అవకాశం లేదు. రవిప్రకాష్, శివాజీలు నేరం చేసినట్టు ప్రాధమిక సాక్ష్యాలు లభించడంతోనే కోర్టు ఇద్దరి ఇళ్లలో సెర్చ్ చెయ్యమని సెర్చ్ వారంట్ జారీ చేసింది. సో కోర్టు నుండి రక్షణ పొందటం కూడా ఇక లేనట్లే. ఇప్పటికే మూడు నోటీసులు ఇవ్వడం… శివాజీ, రవిప్రకాశ్ లు స్పందించక పోవడం తో 41 సీఆర్పీసీ నోటిసులతో ఇద్దరి ని అదుపులోకి తీసుకొని విచారి0చాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించుకున్నారు. అయితే తమపై కేసు పెట్టిన వారితో విత్ డ్రా చేయించుకునేందుకు పావులు కదువుతున్నట్టు తెలుస్తోంది. తమని ఇంత ఇబ్బందులు గురి చేసిన వారిపై కచ్చితంగా చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికే యజమాన్యం కట్టుబడి ఉండటం తో శివాజీ పరిష్టితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది. తనకు ఎలాంటి ప్రయోజనాలు లేకపోయినా గరుడ పేరుతో చంద్రబాబు కి సాయం చేస్తే.. తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎరక్క పోయి ఇరుక్కున్నారు. శివాజి అమెరికా చెక్కేద్దాం అనుకున్నా అది విఫలం అయినట్టు తెలుస్తోంది. మొత్తం మీద గరుడ పురాణం శివాజీ అడ్డంగా ఇరుక్కన్నాడని చెప్పక తప్పదు.