YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేసిఆర్ కు ఊహించని అనుభవాన్ని మిగిల్చిన స్టాలిన్

 కేసిఆర్ కు ఊహించని అనుభవాన్ని మిగిల్చిన స్టాలిన్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

జోరుగా ప్రయాణం సాగుతున్న వేళ.. అనుకోని స్పీడ్ బ్రేక్ ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది? మూర్తీభవించిన ఆత్మవిశ్వాసంతో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దూసుకెళుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఊహించని అనుభవాన్ని మిగిల్చింది డీఎంకే అధినేత స్టాలిన్ తో సమావేశం. సీఎం కేసీఆర్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా?  తనకు అవసరమైతే ఎంతకైనా తగ్గేందుకు వెనుకాడని ఆయన.. ఒకసారి పట్టు చిక్కిన తర్వాత ఎంతలా చుక్కలు చూపిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు.తన అపాయింట్ మెంట్ కోసం ప్రముఖులకు సైతం చుక్కలు చూపించే కేసీఆర్కు దాదాపు అలాంటి అనుభవాన్నే మిగిల్చారు డీఎంకే అధినేత. తాను భేటీ అవుతానన్న మాటకు బదులు రాని వేళ.. తమిళనాడు నుంచి తెలంగాణకు వచ్చేసిన గులాబీ బాస్.. మళ్లీ వెంటనే బయలుదేరటం ఆసక్తికరంగా మారింది.ఇంత కష్టపడిన దానికి ఫలితం ఎలా ఉందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గంట పాటు సాగిన సారు.. స్టాలిన్ భేటీపై డీఎంకే స్పందిస్తూ.. మర్యాదపూర్వక భేటీగా 
ముక్తసరి ప్రకటన చేయటం ద్వారా..  కేసీఆర్ బాటలో తాను నడవనన్న విషయాన్ని తేల్చేసినట్లుగా చెప్పాలి. ఇరువురు అగ్రనేతల భేటీ అనంతరం.. మీడియాతో ఉమ్మడి ప్రకటన ఉంటుందన్న దానికి 
భిన్న పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీటింగ్ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడింది లేదు.ఈ ప్రపంచంలో ఒకరికి మించిన మొనగాళ్లు మరొకరు ఉంటారు. నాకు మించినోళ్లు మరొకరు ఉండరన్నది ఆత్మవిశ్వాసం కంటే అత్యాశే అవుతుంది. ఒకరికి మించిన మొనగాళ్లను మరొకరిని తయారు చేసే గొప్పతనం ప్రకృతిదే. కాకుంటే.. కొందరి గొప్పతనం కొన్నిసార్లు హైలెట్ అవుతూ ఉంటుంది. అంత మాత్రాన మిగిలిన వారిలో ఉన్న ప్రతిభ మసకబారదు. అవసరానికి తగ్గట్లు అందరికి అవకాశం వస్తుంది.కోట్లాది మంది తెలుగు వారిని తన మాటలతో ప్రభావితం చేసే కేసీఆర్ లాంటి అధినేత మీద ఎన్ని అంచనాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఆయన.. తనకున్న ఇమేజ్ ను మరింతగా పెంచుకునే తపనలో తప్పు చేస్తున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి.తన మాటలతో ఎలాంటి వారినైనా కన్వీన్స్ చేసే సత్తా ఉన్న అధినేతగా కేసీఆర్ కు పేరుంది. అలాంటి కేసీఆర్.. ఊహించని రీతిలో డీఎంకే అధినేత స్టాలిన్ చతురత ముందు తగ్గాల్సి వచ్చిందా? అంటే 
అవుననే సమాధానం వినిపిస్తోంది. దక్షిణాదిలోని బలమైన రాజకీయ పార్టీలన్నీ ఏకం కావటం ద్వారా.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా పావులు కదపటం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలకు వెళ్లిన 
కేసీఆర్ కు తమిళనాడులో స్టాలిన్ మీటింగ్ సరికొత్త అనుభవాన్ని మిగిల్చిందని చెప్పాలి.
ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇవ్వాలన్న కేసీఆర్ ను.. తాను గతంలోనే కాంగ్రెస్ కు మాట ఇచ్చానని.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానని ఇప్పటికే రెండుసార్లు చెప్పిన నేపథ్యంలో.. తన మాటను తాను వెనక్కి తీసుకోనని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. గంట పాటు సమావేశంలో స్టాలిన్ ను కన్వీన్స్ చేయటంలో కేసీఆర్ విఫలమైనట్లుగా సమాచారం. అన్నింటికి మించిన ఆసక్తికర అంశం ఏమంటే.. అందరిని తన మాటలతో కన్వీన్స్ చేసే కేసీఆర్.. చివరకు స్టాలిన్ మాటలకు కన్వీన్స్ అయినట్లుగా తెలుస్తోంది.స్టాలిన్ మైండ్ సెట్ మార్చాలని.. ఆయన్ను తనకు తగ్గట్లుగా మార్చుకోవాలని భావించిన కేసీఆర్ నే మార్చేసిన ఆయన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ కంటే కూడా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారుకు మీరే మద్దతు ఇవ్వొచ్చుగా? అంటూ స్టాలిన్ చెప్పిన మాటలకు కేసీఆర్ నోటి వెంట సమాధానం లేదన్న మాట వినిపిస్తోంది. చేతిలో పవర్ లో లేకున్నా.. పవరున్న పక్క రాష్ట్ర సీఎం వచ్చి అడిగినా వెనక్కి తగ్గని 
స్టాలిన్.. తనకున్న పవర్ ఎలాంటిదో తాజా మీటింగ్ తో స్పష్టం చేశారని చెప్పక తప్పదు. 

Related Posts