పూర్తి స్థాయి మెజార్టీ రాకున్నా మిత్రులతో అధికార పీఠం ఎక్కుతామని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు ధీమాగా ఉన్నాయి. భారతీయ జనతాపార్టీ ఆధ్వ్యర్యంలో 2004వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కేవలం 152 స్థానాలతోనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి ఎన్నికలలో వామపక్షాలు 67 స్థానాలు గెలుపొందడం,తమిళనాడులోని డీఎంకే పార్టీ బలం ఇతర చిన్నా చితకా పార్టీలతో ప్రకూటమిగా ఏర్పడి భారతీయజనతా పార్టీని అధికారం దూరంగా నెట్టగెలిగాయి. అయితే ప్రస్తుతం అటువంటి వాతావరణమ్ కనిపించటంలేదు..దానికి తోడు కమ్యూనిస్టు పార్టీలు గతవైభావాన్ని కోల్పోయి కేవలం ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి. ఈ పరిస్థులలో వామపక్షాలును అధికారంలోకి వచ్చే
పార్టీలు అంతగా పట్టించుకోవు.అయినా వామపక్షాలు భారతీయజనతా పార్టీకి బద్ద శత్రువుకావటంతో కాంగ్రెస్ పార్టీ వ్యపు మొగ్గు చూపుతాయనడంలో సందేహం లేదు.అయితే బెంగాల్ లో తన బద్ద శత్రువు అయినా మమతాబెనర్జీని అధికారం కు దరిచేయకుండా చేయాలి అన్నది వామపక్షాల భావనగా తెలుస్తోంది. ఇక ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆలోచన బయట పాడకపోయినా మెజార్టీకి తక్కువైనా పక్షంలో ఈయన మద్దతు ను భారతీయ జనతా పార్టీ పొందవచ్చు. ఇక ఆంద్ర ప్రదేశ్ లోని జగన్ చంద్రబాబులు ఏవిధంగా స్పందిస్తారో ఎన్నికలు ఫలితాలు వెలువడిన తరువాత బయటపడుతుంది. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ ఫై ఒంటి కాలుతో లేస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ తో పాటు ఇతర పక్షాలు తో సంప్రదింపులు జరిపి కూటమిని అధికారంలోనికి తేవటానికి ప్రయత్నించవచ్చు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం పట్టు పట్టవచ్చు.ఈ పరిస్థులలో ఫెడరల్ ప్రెంట్ కు ఎవరు మద్దత్తు ఇస్తారో ప్రశ్నర్థకమే.