యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇండియన్ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. దీంతో తొమ్మిది రోజుల నష్టాలకు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 228 పాయింట్లు లాభపడింది. 37,319 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 74 పాయింట్ల లాభంతో 11,222 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మార్కెట్ గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్లలో నష్టపోతూ వచ్చింది. దీంతో షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. మరోవైపు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు రికవరీ కావడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. నిఫ్టీ 50లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, వేదాంత, ఇండస్ఇండ్ బ్యాంక్, గెయిల్, ఎస్‌బీఐ, రిలయన్స్, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్ దాదాపు 3 శాతం పెరిగింది. సన్ ఫార్మా, ఎయిర్‌టెల్ షేర్లు 6 శాతం ఎగశాయి. ఎస్‌బీఐ 3 శాతం పైకి కదిలింది. అదేసమయంలో టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఏసియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం షేర్లు నష్టపోయాయి. టెక్ మహీంద్రా 3 శాతానికి పైగా పడిపోయింది. ఇన్ఫోసిస్ 1 శాతం క్షీణించింది.సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ దాదాపు లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఐటీ మాత్రమే నష్టాల్లో క్లోజయ్యింది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లు ఎక్కువగా లాభపడ్డాయి. రూపాయి రికవరీతో ఐటీ స్టాక్స్‌పై ఒత్తిడి ఏర్పడింది.