YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

స్వాజిలాండ్ లో ప్రతి ఒక్కరూ ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి

స్వాజిలాండ్ లో ప్రతి ఒక్కరూ ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
మనదేశంలో ఓవైపు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క నానా అగచాట్లు పడుతుంటే ఆఫ్రికాలోని స్వాజిలాండ్ కు చెందిన రాజు మెస్వాతి-3 విచిత్రమైన ఆదేశాలు జారీచేశారు. దేశంలోని మేజర్ అయిన ప్రతీ పౌరుడు కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఇందుకు 2019, జూన్ నెలను తుది గడువుగా నిర్ణయించారు.ఈలోగా పెళ్లి చేసుకోకుంటే పురుషులు లేదా స్త్రీలకు యావజ్జీవ శిక్ష విధిస్తామని హెచ్చరించారు. అయితే ఐదుగురు మహిళలను పెళ్లి చేసుకునేవారికి పెళ్లి ఖర్చులతో పాటు ఆ భార్యలకు ఇళ్లను కూడా ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు.  ఆఫ్రికా దేశమైన స్వాజిలాండ్ లో పురుషుల జనాభా కంటే మహిళల జనాభా అధికం. అందుకే ఈ దేశాన్ని కన్యల రాజ్యంగా అభివర్ణిస్తారు. ఈ నేపథ్యంలో స్త్రీ-పురుష జనాభా మధ్య సమతూకం కోసం ఒక్కొక్కరు కనీసం ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలని రాజాజ్ఞ జారీ అయింది. అన్నట్లు ఇంత కఠినమైన ఆదేశాలు జారీచేసిన మెస్వాతి-3కి 15 మంది భార్యలు, 25 మంది సంతానం ఉన్నారు.మెస్వాతి-3 తండ్రి ఈయన కంటే ఘనుడే. ఆయనకు 70 మంది భార్యలు, 150 మందికిపైగా సంతానం ఉంది. కాగా, ఇలాంటి చర్యల వల్ల దేశం మరింత పేదరికంలోకి జారిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా స్వాజిలాండ్ రాజు మెస్వాతి-3 మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు.

Related Posts