విజయవాడ కనకదుర్గ ఆలయంలో భద్రతా లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భద్రతా సిబ్బందిని పెంచాలని ఆలయ ఈవోకు పోలీసులు సూచించారు. ఆలయ ప్రవేశ మార్గంలో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేయాలని, భక్తుల ప్రవేశ మార్గాలు, బయటకు వెళ్లే మార్గాల వద్ద సెక్యూరిటీ ఉంచాలని, లగేజ్ బ్యాగ్ స్కానర్స్ ను ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆలయ ఈవో కోటేశ్వరమ్మ స్పందిస్తూ, భద్రతా చర్యలను నెలలోగా చేపడతామని చెప్పారు.