YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనంతపురంలో గాంధీ గ్రామాలు

అనంతపురంలో గాంధీ గ్రామాలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

అహింస,శాంతి,సామరస్యం,పారిశుద్యం,మద్యానికి దూరంగా ఉన్నాయి గ్రామాలు.. ఒకటి అడిగుప్ప, రెండవది సమ్మయ్య దొడ్డి గ్రామం.అనంతపురం జిల్లాలో ప్రత్యేకత సంతచరిచుకున్న గ్రామాలపై స్టోరీ. అనంతపురం జిల్లా రాయదుర్గం నియెజక వర్గంలో అడిగుప్ప గ్రామమిది.రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతున్నా అడిగుప్ప, సమ్మయ్య దొడ్డి గ్రామాల్లో కొన్ని దశాబ్దాలుగాసంపూర్ణ మద్యనిషేదం అమలులో ఉంది. మద్యం, ధూమాపాన ప్రియులు ఈ గ్రామాల్లో కనిపించరు. మాంసం తినరు.చివరకు కోళ్ళను పెంచరు. కోడిగుడ్డుకూడా తినరు. గ్రామాల్లో కనీసం కోళ్ళు కనిపించవు. చెడు అలవాల్టకు పూర్థిగా దూరంగా ఉంటున్నారు.గాంథీజీ మాట, బాటను ఆచరించినప్పుడే ఆయన ఆశయం సిద్దించినట్లు. పూజ్య బాపూజీ కలకలుకన్న గ్రామ స్వరాజ్యం అనంతపురం జిల్లాలో రెండుగ్రామాల్లో సాక్షాత్కరిస్తుంది.వాటిని దరిచేరనీయరు. గ్రామస్తులంతా కలిసికట్టుగా జీవిస్తున్నారు. ఇక్కడ పగ, ప్రతీకారాలకుతావులేదు. అంతా శాంతి సామరస్యాన్ని పాటిస్తారు. ఇప్పటిదాకా ఈ గ్రామాల్లో పోలీసులు అడుగుపెట్టలేదు. పోలీసురికార్డులకు దూపంగా ఉంటున్నాయి ఈ రెండుగ్రామాలు. గ్రామాల్లో ఏపని చేయాలన్న రచ్చబండదగ్గరచేరి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల నిర్ణయానికి కట్టుబడి 
నడుచుకుంటారు.పరిశుబ్రతను పాటిస్తారు, పచ్చనిపొలాలు, ఏపుగా పెరిగిన చెట్లు, గ్రామాలకు శోభనిస్తున్నాయి. రెండుగ్రామాల ప్రజలు వ్యవసాయం మీద ఆదారపడి జీవిస్తారు.అడిగుప్ప, సమ్మయ్యదొడ్డి రెండుగకరామాల్లో 300 దాకా నివాసగుృహాలున్నాయి.అడిగుప్ప పాఠశాలలో మద్యన్న భోజన పతకం అమలులో ఉన్నా విద్యార్థులు కోడిగుడ్డు తినరు.తల్లిదండ్రుల, విద్యార్థుల కోరికమేరకు ఆహరమెనూలో గుడ్డు బదులు అరటిపండును చేర్చారు.విధ్యాభోధన చేయడానికి  వచ్చిన ఉపాద్యాయులు ఆక్షర్యం వ్యక్తం చేస్తారు.గాంధీజీ అడుగుజాగల్లో నడుస్తున్న ఈ గ్రామాలను ఆ మహత్ముడు జీవించి ఉంటే తనకల సాకారమైందని సంబరపడేవారేమో. మహిలా సంఘాల ఉద్యమాలు,స్వచ్చందసంస్థల ప్రచారంవలన మద్య రహిత గ్రామాలు ఏర్పడకపోయినా, గ్రామస్తులు తమకుతామే తీసుకున్న నిర్ణయం ఆదర్శనీయం...

Related Posts