YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ కి యోగం... లేనట్లేనా

రాహుల్ కి యోగం... లేనట్లేనా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాహుల్ గాంధీకి కావాల్సినంత సమయం ఉంది. ప్రధాని అయ్యేందుకు వయసు ఇప్పుడే ఏమీ మించిపోలేదు.రాహుల్ ప్రధాని పదవిని ఈసారి త్యాగం చేయాల్సిందే. ఇవీ కాంగ్రెస్ కూటమిలోని మిత్రపక్షాల నుంచి విన్పిస్తున్న మాట. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల ఒంటరిగా పోటీ చేస్తోంది. తమిళనాడు, కర్ణాటక, బీహార్ లను మినహాయిస్తే మిగిలిన చోట్లఒంటరిగానే బరిలోకి దిగింది. కాంగ్రెస్ మొత్తం 423 స్ధానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశాలు లేవన్నది సుస్పష్టం.ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఒకే ఒక ఆశ. ప్రధాని నరేంద్ర మోదీపై వ్యతిరేకత, న్యాయ్ పథకం కాంగ్రెస్ పార్టీని గట్టెక్కిస్తుందని నమ్ముతున్నారు. నరేంద్రమోదీ మీద వ్యతిరేకత కొంత వరకూ కాంగ్రెస్ కు ఉపకరించే అవకాశముంది. అయితే న్యాయ్ పథకం క్షేత్రస్థాయిలోకి బలంగా వెళ్లలేదని కాంగ్రెస్ పార్టీ పెద్దలే అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం జరిగిన ఆరు దశ ఎన్నికల్లోనూ రాహుల్ పార్టీ పెద్దగా స్కోర్ చేసే అవకాశం 
కన్పించడం లేదు.మిత్రపక్షాలదే పై చేయి అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా 
మమత బెనర్జీ, మాయావతి, శరద్ పవార్ వంటి ప్రాంతీయ పార్టీ నేతలు కాంగ్రెస్ కు ప్రధాని పదవి ఇచ్చేందుకు సుముఖంగా లేరు. కాంగ్రెస్ నుంచి కాకుండా ప్రాంతీయ పార్టీల నుంచే ప్రధాని అభ్యర్థిగా ఉండాలని వాళ్లు గట్టిగా భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు పశ్చిమ బెంగాల్ ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ఇక్కడ కొందరు ఉదహరిస్తున్నారు.మమత బెనర్జీ బెంగాల్ టైగర్ కాదని, మే 23 తర్వాత నేషనల్ టైగర్ అని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ మిత్రపక్షాల్లో చర్చ జరుగుతోంది. శరద్ పవార్ సయితం అవకాశం వస్తే వదులుకునే పరిస్థితిలేదు. అయితే మహారాష్ట్రలో ఎన్సీపీకి అధిక స్థానాలు దక్కితేనే అది సాధ్యమవుతుంది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకోవడంతో మాయావతికి ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం లేదు. ఒక్క మమత బెనర్జీయే అధిక స్థానాలు సాధించే ప్రాంతీయ పార్టీ అధినేతగా కన్పిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ కూటమికి ఎక్కువ స్థానాలు దక్కినా రాహుల్ కు ఈసారి ప్రధాని యోగం లేదనేది పార్టీ వర్గాల టాక్.

Related Posts