కత్తి మహేష్ పుణ్యమా అంటూ
గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ అభిమానుల చేష్టలు ఒక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. కత్తి మహేష్ పుణ్యమా అంటూ దాదాపుగా ఏదొక మీడియా ఛానల్ లో పవన్ ఫ్యాన్స్ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇంతగా చర్చలు జరుగుతున్నా, వారిలో ఏమైనా మార్పు కనపడుతోందా అంటే, అది అంతకంతకూ పెరిగిపోతోందనే సంకేతాలు కనపడుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో పవన్ ఫ్యాన్స్ యొక్క ఆలోచనలను ప్రశ్నించేలా చేస్తోంది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే… ఈ సమాజానికి పవన్ ఫ్యాన్స్ చేటు కలిగిస్తారని కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నాయి. అయితే ఇది కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే చేస్తోంది కాదు, ‘జనసేన’ అధినేత కూడా ఇలాగే నోరు లేపని వారిపై సెటైర్లు వేస్తూ కాలం గడపడం శోచనీయం. రోజూ పవన్ ను బండ బూతులు తిట్టే వైసీపీ నేత రోజాను ఏమీ అనలేని పవన్, ఎప్పుడో ఒకసారి పవన్ పై స్పందించిన శేఖర్ కమ్ములపై విమర్శలు చేయడం పవన్ ఆలోచనలకు అద్దం పడుతోంది. గతంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సందర్భంలో కూడా పవన్ మరియు ఆయన అభిమానులు ఇలాగే చేతులెత్తేసిన వైనం తెలిసిందే. ఇలా నోరు లేని వారిపై చెలరేగడం వెన్నతో పెట్టిన విద్యలా మారింది. బహుశా ఇలాంటి సంఘటనలు చూసే కత్తి మహేష్ లాంటి వారిలో విప్లవం రేగిందేమో గానీ పవన్ దిగొచ్చే వరకు వదలనని భీష్మించుకుని కూర్చున్నారు. పోస్టర్ ను చెప్పుతో కొట్టిన వ్యక్తిలో ఎంత అవివేకం దాగి వుందో, సదరు వ్యక్తిని చావకొట్టిన మందిలో ఇంకెంత అజ్ఞానం దాగి వుందో అర్ధం చేసుకోవాలి. వీరిని మార్చడం బహుశా తన వల్ల కూడా కాదని పవన్ కూడా మౌనం వహిస్తున్నారేమో! అయినా ముందు పవన్ మారాలి కదా!?