యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పశ్ఛిమ బెంగాల్ లో జరిగిన హింస ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాయి. అమిత్ షా పై జరిగిన దాడిని ఖడిస్తున్నాం. హింస ద్వారా అధికారంలో రావాలని బెంగాల్ సీయం ఫ్రయత్నిస్తున్నారని ఏపీ బీజేపీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు.
తృణముల్ పార్టీని ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాలని ఎలక్షన్ కమీషన్ ను డిమాండ్ చేస్తున్నాం. ప్రాంతీయ పార్టీల అధికారంలోకి రావడంతోనే రాష్ట్రం సర్వం తమ సొంతమనే భావనలో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల పోకడ దేశ సమగ్రతను దెబ్బతీస్తోందని అన్నారు. రాష్ట్రం రాజకీయలలో ఎన్నికల ఫలితాల తర్వాత కీలక పాత్ర పోషిస్తాం. మమతా బెనర్జీ పై చర్యలు తీసుకోవాలని ఈసీని డిమాండ్ చేస్తున్నామని అయన అన్నారు.