YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి - కౌంటింగ్‌ ఏజెంట్లకు నాయకులు సూచన-

 ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి         - కౌంటింగ్‌ ఏజెంట్లకు నాయకులు సూచన-
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఈ నెల 23వ తేదీన కౌంటింగ్‌ జరగనున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కౌంటింగ్‌ ఏజెంట్లకు సూచించారు. స్థానిక జెఎన్‌ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ శిక్షణ కేంద్రంలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కౌంటింగ్‌ ఏజెంట్లకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి, అలాగే అపర భగీరధుడు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా ఛైర్మన్‌ గన్ని కృష్ణ, శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణు గోపాలరాయుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు)లు మాట్లాడారు. ఈ నెల 23వ తేదీ చాలా కీలకమైన రోజని.... ఇప్పటి వరకూ పడిన కష్టానికి ప్రతిఫలం లభించే రోజు అదేనన్నారు. కౌంటింగ్‌ సమయంలో ప్రతి ఒక్క ఏజెంట్లు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కౌంటింగ్‌ టేబుల్‌ మీదకు వచ్చిన ఈవీఎం పరిస్థితిని పరిశీలించాలన్నారు. ఏప్రిల్‌ 11వ 
తేదీన జరిగిన పోలింగ్‌ అనంతం వేసిన సీలు సక్రమంగా ఉందో లేదో పరిశీలించాలని, అలాగే ఆ సమయంలో ఈవీఎంకు మనం వేసిన సింబల్‌ను పోల్చు కోవాలన్నారు. అలాగే పోలింగ్‌ సమయంలో పోలైన ఓట్ల సంఖ్య, కౌంటింగ్‌ అనంతరం వచ్చి ఓట్ల సంఖ్యను సరి పోల్చుకోవాలని సూచించారు. ఈ విషయాల్లో ఏ మాత్రం తేడాలు వచ్చినా వెంటనే సంబంధిత అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆఖరి ఈవీఎం తెలిచే వరకూ ఓపిగ్గా ఉండాలన్నారు. వీవీ ప్యాడ్లను కూడా లెక్కిస్తారని... అయితే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో పోలైన ఓట్లకు, వీవీ ప్యాడ్‌ల్లో నమోదైన ఓట్లకు సరి పోవాలని, ఆ విషయాలను జాగ్రత్తగా పరిశీలించి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరితోనూ ఘర్షణలకు పోకుండా, అధికారులు, తోటి ఏజెంట్లతో స్నేహ పూర్వకంగా మెలగాలని కోరారు. కాగా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని ఇప్పటికే ఒక స్పష్టత వచ్చిందని, ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు అమలు చేసిన సంక్షేమ పథకాలే పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురాబోతున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీకి తూర్పు గోదావరి జిల్లా నుంచే విజయ పరంపర ప్రారంభమవుతుందన్నారు. మంచి మెజార్టీతో విజయం సాధించబోతున్నామన్నారు. అందుకు గాను.... ఇప్పటి వరకూ చేయాల్సిన కృషి చేశామని, 23వ తేదీ ఒక్కరోజు మాత్రం ఏజెంట్లంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నిర్లక్ష్యం వహించకుండా, నిబందనలకు లోబడి వ్యవహరించాలన్నారు. ప్రతి ఈవీఎం తెరిచే సమయంలో ప్రతి అంశాన్ని ఒకటికి రెండు సార్లు పరిశీలించాలన్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే ప్రశ్నించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఛాంబర్‌ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, వాడపల్లి వెంకన్న ఆలయం ఛైర్మన్‌ నరసింహారావు, నాయకులు కురగంటి సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Related Posts