YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీని ఎంత త్వరగా సాగనంపితే దేశం అంత సంతోషిస్తుంది

మోడీని ఎంత త్వరగా సాగనంపితే దేశం అంత సంతోషిస్తుంది

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎప్పుడూ ఏనాడూ పరుష పదజాలం వాడని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆఖరు దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కొంచెం ఘాటుగానే నరేంద్రమోడీని విమర్శించారు. భారత దేశ ఆత్మను అర్ధం చేసుకోలేకపోయిన ప్రధాని నరేంద్రమోడీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాగనంపితే దేశం సంతోషిస్తుందని మన్మోహన్ సింగ్ అన్నారు. సమాజానికి విరామంలేని మానసికవేదన, విధ్వంసకర రాజకీయాలు, గాడితప్పిన పాలన ప్రస్తుత ప్రభుత్వంలో వేళ్లూనుకుని ఉన్నాయని మన్మోహన్ సింగ్ అన్నారు. మోడీ చేసిన ఐదేళ్ల పాలనలో కేవలం ప్రచార పటాటోపం తప్ప పని ఏమాత్రం జరగలేదని ఆయన అన్నారు. 86 సంవత్సరాల మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం జూన్ 14న ముగుస్తుంది. తాను పదవులకు అంటిపెట్టుకుని ఉండాలని అనుకోవడం లేదని మన్మోహన్ సింగ్ అంటున్నారు. అయితే దేశానికి సంబంధించిన అంశాలపై సరైన మార్గనిర్దేశనం చేయాల్సిన అవసరం కనిపిస్తున్నదని ఆయన అన్నారు.మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఉద్దేశించి అవినీతి ప్రధాన మంత్రి అని ఒక సారి, విరాత్ ఐఎన్ఎస్ లో విహార యాత్రకు వెళ్లారని ఒక సారి దారుణమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలలో ఉన్నత స్థానాలలో ఉన్నవారు సభ్యత పాటించడం అనేది గత చరిత్రగా మిగిలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇతరులు పాటించేంతటి ఉన్నత సాంప్రదాయాలను అనుసరించాల్సిన ప్రధాని పదవి ఇప్పుడు ఎవరూ అనసరించరాని వ్యక్తిత్వంగా మిగిలిపోయిందని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఒక్కటే తనకు బాధ కలిగిస్తున్న అంశమని ఆయన అన్నారు. అవసరానికి తగినట్లు మాట్లాడటం కేవలం పైపై మెరుగుల కోసం ఉపకరిస్తుందేమో కానీ సమాజంలో మౌలిక మార్పులు తీసుకురావడానికి పనికిరాదని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లుగా దేశంలో 
నిజమైన సమస్యలు సమస్యలుగానే ఉండిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే ప్రజలు తగిన తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు.

Related Posts