ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేకత జగన్‌కు కలిసొచ్చే అంశంగా కనబడుతుందన్నారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు. చంద్రబాబు స్వయంకృత అపరాధాలే ఆయన ఓటమికి కారణం అవుతాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాకపోతే బలోపేతం అయ్యేందుకు కొంత సమయం పడుతుందన్నారు. కచ్చితంగా తెలంగాణలో బలోపేతం అవుతామని వెల్లడించారు. ఇక దేశ వ్యాప్తంగా మోదీకి ప్రత్యామ్నాయం కనిపించే పరిస్థితి లేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తప్ప.. దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. ఈసారి కూడా 280కి పైగా స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ 75 స్థానాలకు మించి వచ్చే అవకాశాలు లేవన్నారు. మే 23 తర్వాత ఏం చేస్తామనేది స్పష్టంగా చెబుతామన్నారు.