అమిత్ షా రోడ్ షో హింసాత్మకంగా మారిన ఘటనను నిరసిస్తూ ఇవాళ కేంద్ర మంత్రులు ఢిల్లీలో ధర్నా చేప్టటారు. మంగళవారం బీజేపీ అధ్యక్షుడు కోల్‌కతాలో ర్యాలీ తీశారు. ఆ సమయంలో బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. ఆ సంఘటనను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. కేంద్ర మంత్రులు హర్షవర్దన్, జితేంద్ర సింగ్, విజయ్ గోయల్‌తో పాటు ఇతర పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. బెంగాల్‌లో జరిగిన హింసను కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. అయితే బీజేపీ ఆ హింసకు కారణమంటూ గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. బెంగాల్‌లో బీజేపీ గెలవాలని తపనతో ఉన్నదని, దాని కోసం సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి ప్రభుత్వ శక్తులను వాడుకుంటున్నదని ఆయన ఆరోపించారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను సీపీఎం తీవ్రంగా ఖండించింది. బీజేపీ, టీఎంసీ కార్యకర్తలతో దాడిలో ఈశ్వర్ చంద్ర విగ్రహం ధ్వంసమైంది. విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఇవాళ కోల్‌కతాలో ఆ పార్టీ నేతలు ర్యాలీ తీశారు.