యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ పై చెప్పులతో దాడి జరిగింది. హిందూ ఉగ్రవాదంపైనా, స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది హిందువేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హిందూ సంఘాల కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ర్యాలీలో కమల్ పాల్గొన్న వేళ, ఓ వ్యక్తి కమల్ పైకి చెప్పును విసిరాడు. అయితే, అది ఆయన పక్క నుంచి వెళ్లింది. ఈ ఘటనను చూసిన మరికొందరు సైతం కమల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు.